రంగారెడ్డి, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారులపై వాహనాల రద్దీ లేకుండా పోలీసుశాఖ సమ న్వయంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని.. రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే క్షతగాత్రులను దవాఖానలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని.. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలోని రహదారులు, అంతర్గత దారులకు అవసరమైన ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలని, రద్దీ ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేలా రోడ్డు, భవనాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ప్రవీణ్‌రావు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు, రవాణా, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.