నాడు మర్రి .. నేడు అనుముల.. 33 ఏండ్ల తర్వాత వికారాబాద్ జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం
33 ఏండ్ల తర్వాత వికారాబాద్ జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుముల రేవంత్రెడ్డి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
- ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా మర్రి చెన్నారెడ్డి
- కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్ రెడ్డి నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం
వికారాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): 33 ఏండ్ల తర్వాత వికారాబాద్ జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుముల రేవంత్రెడ్డి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వికారాబాద్ ప్రాంతం నుంచి రెండో వ్యక్తి సీఎం అవుతుండడం విశేషం. మొదటగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలోని మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
వికారాబాద్, తాండూరు ద్విశాసన సభల నుంచి ఎన్నికైన మర్రి చెన్నారెడ్డి సీఎంగా పనిచేయగా, నేడు జిల్లా నుంచి ఎన్నికైన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి వరించింది. అయితే వికారాబాద్ నుంచి ఎన్నికైన అనంతరం 1978-80 వరకు, తాండూరు నుంచి ఎన్నికైన అనంతరం 1989-90 మధ్య మర్రి చెన్నారెడ్డి రెండు పర్యాయాలు సీఎంగా పనిచేయగా, సరిగ్గా 33 ఏండ్ల తర్వాత జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం కావడంతో రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్తోపాటు వికారాబాద్ జిల్లాకు మహర్దశ రానున్నదని జిల్లా ప్రజానీకం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

