e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home రంగారెడ్డి దేవునిబండలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మానం

దేవునిబండలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మానం

షాద్‌నగర్‌రూరల్‌,అక్టోబర్‌21 : జిల్లాలోని ఫరూఖ్‌నగర్‌ మండలం దేవునిబండాతండాలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి గ్రామ సర్పంచ్‌ మాధవి మోహన్‌ నాయక్‌ గురువారం గ్రామసభలో తీర్మానం చేశారు. ఇందులో భాగంగానే గ్రామసభలో ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్యపాన నిషేధ తీర్మానానికి వార్డు సభ్యులు, గ్రామస్తులందరు అమోదం తెలిపారు.

అదేవిధంగా మద్యపాన నిషేధం పట్ల గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ యువకులు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలంటూ తన దృష్టికి తీసుకురాగా గ్రామ సభలో తీర్మానం చేశామన్నారు.

- Advertisement -

సంపూర్ణ మద్యపాన నిషేధ తీర్మానానికి గ్రామస్తులందరు సమిష్టిగా మద్దతు పలకడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో చాలా మేరకు మద్యపానాన్ని సేవించడం వల్ల ఎన్నో కుంటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, చాలా కుంటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్‌ హెచ్చరించారు. ఎవరైనా తీర్మానానికి విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే రూ.25వేలు జరిమానా విధిస్తామన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement