Suburban buses | ఆమనగల్లు వరకు సిటీ సబర్బన్ బస్సులను నడపాలని మంత్రికి వినతి
Suburban buses | హైదరాబాద్ నుండి ఆమనగల్లు వరకు సిటీ సబర్బన్ బస్సులను నడపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గీతముదిరాజ్ కోరారు.
కడ్తాల్, మే 25 : హైదరాబాద్ నుండి ఆమనగల్లు వరకు సిటీ సబర్బన్ బస్సులను నడపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గీతముదిరాజ్ కోరారు. ఆదివారం హైదరాబాద్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసిన్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం ఆమనగల్లు, కడ్తాల్ మండలాల నుండి వందల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కి రాకపోకలు కొనసాగిస్తారని, ప్రయాణీకుల కోరిక మేరకు ఆమనగల్లు వరకు సిటీ సబర్బన్ బస్సులను నడపాలని మంత్రిని కోరిన్నట్లు ఆమె తెలిపారు.
అదే విధంగా కడ్తాల్ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ను ఏర్పాటు చేయాలని, కడ్తాల్-షాద్నగర్ మార్గంలో నిలిపిన ఆర్టీసీ బస్సులను వెంటనే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించిన్నట్లు చైర్పర్సన్ తెలిపారు. ఆమె వెంట ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహా ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

