తుర్కయంజాల్, ఆగస్టు 18 : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ ప్రగతి నగర్ కాలనీ ఫేస్ -2లో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేసిన బాయ్స్ హాస్టల్‌ను కాలనీ నుంచి తరలించాలని కోరుతూ ప్రగతి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ అమరేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ప్రగతి నగర్ కాలనీ ఫేజ్ -2లో కాలనీ అసోసియేషన్ సభ్యులకు సమాచారం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యలో డిగ్రీ విద్యార్థుల సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఏర్పాటు చేశారు.
అయితే కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడంతో హాస్టల్ ద్వారా కాలనీ డ్రైనేజీ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. దానికి తోడు హాస్టల్ కి జాగ్రత్త చర్యలు పూర్తి స్థాయిలో లేననందున కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సివాస్తుంది. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోని హాస్టల్ ను మరో చోటుకు తరలించాలని కమిషనర్ ను కోరినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.