షాద్‌నగర్ రూరల్,జూన్01 : తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ వెంకట్రాంరెడ్డి, సమితి సభ్యులు అదివారం ఎమ్మెల్సీ కోదండరాంకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్సీ కోదండరాంను మర్యాదపూర్వకంగా కలుసుకొని ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఉద్యమకారులకు గుర్తింపు కార్డును అందజేయాలని ఆయనను కోరారు.
అదేవిధంగా షాద్‌నగర్ పట్టణంలో తెలంగాణ అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించేలా చూడాలని ఉద్యమకారుల కుటుంబలకు రూ.10లక్షల ఆరోగ్యబీమా సౌకర్యం కల్పించాలన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల కోసం రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో సమితి సభ్యులు శ్రీనివాస్, ఆర్ల యాదయ్య, శ్రీనివాస్‌రెడ్డి, సుధకర్, రాజు, బాలునాయక్, నర్పింలు, రవికుమార్‌గౌడ్ పాల్గొన్నారు.