తుర్కయంజాల్,జూలై 30 : తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి రాగన్నగూడ బృందావనం కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు బుధవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని తొర్రూర్ క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు బృందావనం కాలనీలో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,కృష్ణానీటి పైపులైన్ ,సీసీ రోడ్డు,విధి దీపాల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరగా వెంటనే స్పందించిన ఆయన మున్సిపల్ కమిషనర్‌కు సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సామ భీంరెడ్డి, కాలనీ అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, కాలనీ వాసులు చక్రవర్తి, నరసింహ, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.