హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ఐరోపా సమాఖ్య(ఈయూ), భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు జరుగుతున్న వేళ నగరంలో విద్య, సాంకేతికత, ఆవిష్కరణల విస్తరణ లక్ష్యమని ఐర్లాండ్ మంత్రి జాక్ చాంబర్స్ తెలిపారు.
ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో ప్రముఖ టెక్ సంస్థలు టెక్ఫైండర్, టెస్ట్ ట్రయాంగిల్ కార్యాలయాలను ఆయన ఐర్లాండ్ ప్రతినిధుల బృందంతో సందర్శించారు.