లక్నో : తండ్రితో ఏదో విషయమై గొడవ పడిన ఒక కొడుకు దారుణ హత్యకు పాల్పడిన ఘటన ఈ నెల 20న లక్నోలో జరిగింది. మానవేంద్ర సింగ్ (50) అనే వ్యక్తి అదృశ్యమయ్యాడని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు అందింది. వారు ఆయన కొడుకు అక్షత్ సింగ్(21)ను గట్టిగా ప్రశ్నించగా తన తండ్రిని ఒక గొడవ సందర్భంగా తుపాకీతో కాల్చి హత్య చేశానని అంగీకరించాడు.
ఈ నేరం బయటకు తెలియకుండా ఉండేందుకు తన తండ్రి శరీరాన్ని ముక్కలు చేసి, కొన్ని భాగాలను బయట పారేశానని తెలిపాడు. మిగతా భాగాలను ఒక డ్రమ్ములో కుక్కి, ఇంట్లోనే ఒక ఖాళీ గదిలో ఉంచినట్టు వెల్లడించాడు. మానవేంద్ర శరీర భాగాలను పోలీసులు శవ పరీక్షకు పంపారు. ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించి, నిందితుడిని కస్టడీకి తరలించారు.