Kyathanpalli | క్యాతనపల్లిలో మున్సిపాలిటీ పీఠం దక్కించుకున్న బీఆర్ఎస్.. చైర్‌పర్సన్‌గా గొడిశెల సంధ్యారాణి ఎన్నిక
Kyathanpalli | క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. సీపీఐ మద్దతుతో ఆమె చైర్‌పర్సన్‌గా గెలిచారు.
Kyathanpalli | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని అధికారిక కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. సీపీఐ మద్దతుతో ఆమె మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తు పెట్టుకోగా, 22 వార్డులకుగాను 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థులు ఏడు స్థానాల్లోనే గెలిచారు. కానీ, మంత్రి వివేక్, కాంగ్రెస్ నేతల అరాచకాల వల్ల గతంలో చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు కోర్టు ఆదేశాలతో ఇవాళ క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికను నిర్వహించారు.
ఇవాళ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్, సీపీఐ నుంచి ఎన్నికైన 14 మంది కౌన్సిలర్లు మాత్రం ఎన్నికకు హాజరయ్యారు. ఇక కోరం ఉండటంతో ఎన్నిక ప్రక్రియను సజావుగా కొనసాగించారు. దీంతో గొడిశెల సంధ్యారాణి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇక బీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత వైస్ చైర్మన్‌గా గెలుపొందారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో కూడా గులాబీ జెండా ఎగిరింది. మున్సిపల్ చైర్మన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ ఎన్నికయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

