హైదరాబాద్, ఫిబ్రవరి 24: టెక్నాలజీ సేవల సంస్థ నాసుని..హైదరాబాద్లో తనకున్న రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను మరింత విస్తరించింది. యూనిఫైడ్ ఫైల్ డాటా మేనేజ్మెంట్, రక్షణ, యాక్టివేషన్ రంగాల్లో ఆవిష్కరణలను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఈ విస్తరణ చేపట్టినట్టు కంపెనీ సీఈవో శామ్ కింగ్ తెలిపారు.
ఏఐకి సిద్ధంగా ఉండేలా మౌలిక వసతుల అభివృద్ధికి ఈ సెంటర్ దోహదం చేయనున్నదన్నారు.