రంగారెడ్డి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, మున్సిపల్, ఎంపీడీవో, తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలు,
పోలీస్స్టేషన్లు, ప్రభుత్వ దవాఖానలు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పలు చోట్ల అమరవీరుల స్థూపం వద్ద పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.
– న్యూస్నెట్ వర్క్, నమస్తే తెలంగాణ