రంగారెడ్డి, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని బాటసింగారం పండ్ల మార్కెట్లో మంగళవారం రికార్డుస్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఈ మార్కెట్‌కు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా పెద్ద ఎత్తున మా మిడి కాయలు వస్తున్నాయి. మంగళవారం ఒక్క రోజే సు మారు 900పైగా మామిడికాయల లారీలొచ్చాయి. ఈదురుగాలులు, వడగండ్లవానతోపాటు అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మామిడి రైతులు ముందుగానే కాయలను మార్కెట్‌కు తరలిస్తున్నారు. వ్యాపారులు, రైతులతో పండ్ల మార్కెట్ కిటకిటలాడింది. పెద్ద ఎత్తున మామిడికాయలు మార్కెట్‌కు రావడంతో ఆశించిన ధర పలకలేదని కొంతమంది రైతులు వాపోయారు.
2064 మెట్రిక్ టన్నుల క్రయవిక్రయాలు..
బాటసింగారం పండ్ల మార్కెట్లో మంగళవారం ఒక్క రోజే మామిడి సీజన్లోనే అత్యధికంగా అమ్మకాలు జరిగాయి. 2,064 మెట్రిక్ టన్నుల మామిడి క్రయవిక్రయాలు జరిగాయి. కొనుగోలు చేసిన మామిడికాయలను ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి పలు రాష్ర్టాలతో ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్లో మామిడి విక్రయాలు ఊపందుకోవడంతో అధికారులు వ్యాపారులు, రైతులకు సౌకర్యాలను కల్పిస్తున్నారు. అకాల వర్షాలతో మామిడి కాయ లు నేలరాలడంతోపాటు దెబ్బతింటున్నాయనే రైతులు ముందుగానే మార్కెట్‌కు తీసుకొస్తుండడంతో సందడి మొదలైంది. కాగా మామిడి కాయలను తీసుకొచ్చిన రైతు లకు గిట్టుధర ఇప్పించేందుకు కృషి చేస్తా మని మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
గిట్టుబాటు ధర రావడం లేదు..
మార్కెట్‌కు ఒకేసారి పెద్ద ఎత్తున మామిడి కాయలు వస్తుండడంతో రైతులకు ఆశించిన మేర గిట్టుబాటు ధర రావడం లేదు. అకాల వర్షాలు, వడగండ్ల వాన వంటి పరిణామాల నేపథ్యంలో ముందుగానే రైతులు మామిడికాయలను మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. రూ.50 నుంచి రూ.60లకు అమ్ముడు పోతాయనుకున్న మామిడి కాయ లు మంగళవారం రూ.35 నుంచి రూ.40 వరకు మాత్రమే వచ్చాయి.
-వెంకట్‌రెడ్డి, రైతు