కందుకూరు, జనవరి 7 : ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లను ఇచ్చేందుకు వారి పేర్లతో కూడిన జాబితాలను ఆయా గ్రామ పంచాయతీల్లో ఉంచుతున్నట్లు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. మీర్ఖాన్పేట్, ఆకులమైలారం, అన్నోజిగూడ, బేగరికంచ, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, సార్లరావులపల్లి గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి భూములను సేకరించిందన్నారు.
ఎకరానికి గుంట, 131 గజాల చొప్పున ప్లాట్లను ఇవ్వడానికి వారి పేర్లను గ్రామ పంచాయతీ బోర్డుల్లో బుధవారం నుంచి ఉంచుతామని, అభ్యంతరం ఉన్నట్లయితే వారం రోజుల్లో ఆర్డీ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలని సూచించారు.