Ration : కూలీలు వన్‌నేషన్ వన్ రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి..
- ఈశ్రామ్ కార్డును తీసుకున్న వారికి రూ. 2లక్షల బీమా
- తిర్మలాపూర్‌లో ఈ శ్రమ్ కార్డులను పంపిణీ చేసిన డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి

కులకచర్ల : కూలీలు వన్ నేషన్, వన్ రేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో జన్సహాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కూలీలకు వన్ నేషన్ వన్ రేషన్ పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీలు వన్ నేషన్ వన్ రేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. వలస కూలీలు బ్రతుకు దేరువు కోసం ఇతర రాష్ట్రలకు వెళ్లినా లేదా మన రాష్ట్రానికి వచ్చినా రేషన్ తీసుకునే విధంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
రేషన్ పొందాలంటే తప్పనిసరిగా రేషన్‌కార్డుతో పాటు ఆధారుకార్డు నంబర్ ఉండాలని, ఆధార్‌కు మొబైల్ నంబర్ లింకు ఉండాలని తెలిపారు. డీలర్లు వలసకూలీలకు రేషన్ బియ్యం అందజేయాలని సూచించారు. రేషన్ పంపిణీలో ఏదైనా ఇబ్బంది ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. జన్సహాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ-శ్రామ్ కార్డులు అందిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ-శ్రామ్ కార్డు ద్వారా రెండు లక్షల బీమా వర్తిస్తుందని ప్రతి కూలీ ఈ-శ్రామ్ కార్డు తీసుకోవాలన్నారు.
వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమం, ఈ-శ్రామ్ కార్డులపై అవగాహన కల్పిస్తున్న జన్సహాస్ స్వచ్ఛంద సంస్థ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ ప్రకాశ్‌కుమార్, సర్పంచ్ వెంకటమ్మ, చిన్నయ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాంలాల్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

