చేవెళ్లటౌన్, జూన్ 8 : రేషన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో చౌకధరల దుకాణాల ఎదుట ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. ఎండ వేడిమిని తాళలేక అవస్థలు పడుతున్నారు.
చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని రేషన్ షాపు ఎదుట బియ్యం తీసుకునేందుకు వచ్చిన మహిళలు, పురుషులను కింది చిత్రంలో చూడొచ్చు. బియ్యాన్ని తీసుకునేందుకు మండే ఎండలోనే క్యూలో నిల్చున్నారు. రేషన్ షాపుల నిర్వాహకులు స్పందించి టెంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు పేర్కొంటున్నారు.