షాద్నగర్రూరల్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని పరిగి రోడ్డులో ఉన్న వీరాహనుమాన్ దేవాలయంలో ఆంజనేయస్వామికి వెండితొడుగును గాంధీనగర్ కాలనీకి చెందిన రాజు (క్లాసిక్ టైలర్) తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిమగల ఆంజనేయస్వామికి వెండి తొడుగును అందజేయడం సంతోషంగా ఉందన్నారు.
సుమారు లక్షా 50వేల విలువ చేసే రెండు కిలోల వెండి తొడుగును తయారు చేయించడం జరిగిందన్నారు. ఆంజనేయస్వామికి వెండితొడుగు అందించడంపై భక్తులు శరణప్ప, శ్యామ్, మల్లికార్జున్ అభినందనలు తెలిపారు.