పెద్దఅంబర్‌పేట : కుంట్లూర్ మురుగును భూదాన్ కాలనీ నుంచి మూసిలోకి తరలించేందుకు ప్రభుత్వం రూ. 32కోట్లు కేటాయించిందన్నారు. మరో నాలుగైదు నెలల్లో పనులు మొదలవుతాయని, పనులు జరిగే క్రమంలో అక్రమంగా నాలాలపై చేపట్టిన నిర్మణాలపై తొలగింప చేస్తామని, ఎవరు కూడా నాలాలపై నిర్మాణాలు చేపట్టి ఆర్థికంగా ఇబ్బందుల పాలు కావద్దని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం కుంట్లూర్ భూదాన్కాలనీలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం పలువురు టీఆర్ఎస్లో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొంతమంది కావాలని తగాదాలు పెట్టుకునేందుకు సిద్ధం అవుతున్నారని, పార్లమెంట్ నిధులలో నాలుగు పైసలు కూడా కేటాయించని ఎంపీ జరుగుతున్న అభివృద్ధి అంతా తానే చేపిస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.
నూతన కార్యవర్గం, యూత్ విభాగం, మహిళా విభాగం సభ్యులంతా పార్టీ ప్రతిష్ట కోసం పని చేయాలని సూచించారు. భూదాన్కాలనీలోని పార్కులో కొంతమంది స్థానిక నాయకులు ఖబ్జాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అధికారులతో మాట్లాడి చర్యలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు, కౌన్సిలర్ సిద్ధంకి కృష్ణారెడ్డి, బ్యాంక్ డైరెక్టర్ కళ్లెం ప్రభాకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కార్యదర్శి దామోదర్, యూత్ విభాగం అధ్యక్షుడు పడమటి సుమన్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు రేణుక, పార్టీ మాజీ అధ్యక్షుడు బలరాం, కంచర్ల సత్యనారాయణరెడ్డి, విజయేందర్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్, మాడ్గుల వెంకటేష్, జోర్క రాము, బాబురావు, నాగార్జున, మహిళలు పాల్గొన్నారు.