షాబాద్, ఆగస్టు 23 : రైతులు పంటలకు అవసరానికి మించి ఎరువులు వాడుతూ నష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. భూ మిలో పోషక పదార్థాలను గుర్తించి పంటలకు అనుగుణంగా ఎరువులు వాడితేనే మేలు. నేల స్వభావం గుర్తించకుండా మోతాదుకు మించి వేయడం, ఏ పంటకైనా ఒకే రకంగా ఎరు వులు వేయడం, ఒకరిని చూసి మరొకరు పోటి పడి రసాయన ఎరువులు వేస్తూ అనవసర ఖర్చు పెడుతున్నారని వ్యవసా యాధి కారులు చెబుతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో వరిపంట సాగు చేసే రైతులకు అధికా రులు పలు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
నేల స్వభావం…
నేల స్వభావాన్ని బట్టి పంటలకు కావాల్సిన ఎరువులను ఎంపిక చేసుకోవాలి. సమస్యాత్మక నేలల్లో వివిధ పంటలు సాగు చేసేటప్పుడు, క్షార భూములైతే జిప్సంను భూసార పరీ క్షలను అనుసరించి ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా చౌడు నేలల్లో చౌడు స్థాయిని బట్టి జిప్సం వేసుకోవాలి. పరోక్షంగా ఎరువులు సామర్థ్యం పెరిగి వివిధ సూక్ష్మ పోషకాలు మొక్క లకు అందుబాటులోకి వస్తాయి. నేల బంకమట్టి రేణువుల స్వభావాన్ని బట్టి సిఫార్సు చేసిన నత్రజని ఎరువులను ఎన్ని దఫాలుగా వేయాలో ఆధారపడి ఉంటుంది. ఇసుక నేలల్లో ఎక్కువగా దఫాలుగా, బరువు నేలల్లో 2,3 సార్లు నీటిని తీసి బురదలో ఎరువులు వేస్తే నత్రజని ఎరువుల సామర్థ్యం పెరుగుతుంది.
రకాల ఎంపిక…
వాతావరణ పరిస్థితులను అనువైన రకాలను ఎంపిక చేసు కోవాలి. ఎంపిక చేసుకున్న రకాలు అధిక దిగుబడినిచ్చే, అధిక ఎరువుల వినియోగ సామర్థ్యం కలిగి ఉండాలి. ముఖ్యంగా కొన్ని వరి రకాలను బట్టి నత్రజని అవశ్యకత ఆధారపడి ఉంటుంది. ఆహార పంటలకు , దుంపజాతి పంటలకు నత్ర జని ఎరువుల అవసరం ఎక్కువగా ఉంటుంది. పప్పుజాతి పంటల్లో వేర్లపై ఉండే బ్యాక్టీరియా వల్ల నత్రజని స్థిరీక రింపబడుతుంది. అందువల్ల నత్రజని తక్కువగా ఉంటుంది.
సేంద్రియ, రసాయన ఎరువుల సమతుల్యత…
తేలిక నేలల్లో అయితే సేంద్రియ, రసాయన ఎరువులు 40,60 నిష్పత్తిలో, బరువు నేలల్లో 30 నుంచి 70 నిష్పత్తిలో వేయ డంతో పాటు సేంద్రియ ఎరువులు వాడితే వినియోగ సామ ర్థ్యం పెరుగుతుంది. సూక్ష్మ పోషకాలు మొక్కలకు అందు బాటులోకి వస్తాయి. వ్యవసాయ వ్యర్థాలను కంపోస్టుగా మార్చి ఉపయోగించినప్పుడు యూరియాలాంటి ఎరువుల సామర్థ్యం , నత్రజని లభ్యత పెరుగుతుంది.
నీటి యాజమాన్య పద్ధతులు…
సమర్థ ఎరువుల వినియోగానికి నీటి యాజమాన్యం తప్పని సరిగా పాటించాలి. యూరియా, ఎరువులు వేసినప్పుడు వేప పిండి లేదా వేప నూనెతో కలిపి చల్లితే ఎరువులు వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఎరువులు వేసిన 24 గంటల తర్వా త నీరు పెట్టాలి. యూరియా వేప పిండితో కలిపి చల్లితే వృధా శాతం తగ్గి నత్రజని పంటకు నిదానంగా అందుతుంది. కిరో సిన్ ఒక లీటరు, యూరియా 50 కిలోలు, 15 కిలోల వేప పిండి కలిపి నీడలో అరబెట్టి 24 గంటల తర్వాత పంటకు వేస్తే… వాడాల్సిన యూరియా కన్నా 25 శాతం వరకు తగ్గు తుంది. ఫలితం బాగుంటుంది. వరి పొలాల్లో అయితే నీరు లేని పరిస్థితుల్లో లేదా నీరు తీయలేని పరిస్థితుల్లో మెట్ట ఆరుతడి పంటలో తగినంత తేమ లేనప్పుడూ యూరియా 2 శాతం పిచికారీ చేసి నత్రజని అందించవచ్చు.
ముందుగా కలుపు నివారణ…
ఎరువులు వేసే ముందు కచ్చితంగా కలుపు మొక్కలు తీసి వేయాలి. పీకిన కలుపు మొక్కలను దూరంగా తీసుకువెళ్లి కాల్చేయాలి. దీనిని అవసరాన్ని బట్టి గోతుల్లో వేసి కంపోస్టు ప్రక్రియ ద్వారా సేంద్రియ ఎరువుగా మార్చుకోవచ్చు. వాతావరణంలోని నత్రజని స్థిరీకరించే శక్తి వల్లే నీలి ఆకుపచ్చ నాచు, భాస్వరం అందుబాటులోకి తెచ్చే పాస్ఫో బ్యాక్టీరియా లాంటి భాస్వరం ఎరువులను ఉపయోగించి ఖరీదైన రసా యన ఎరువుల వాడాకాన్ని తగ్గించవచ్చు.
సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి
రైతులు పంటల సాగులో సేంద్రియ ఎరువుల వాడ కాన్ని పెంచాలి. రసాయన ఎరువులు వాడకాన్ని పూ ర్తిగా తగ్గిం చాలి. ముఖ్యం గా వరి పంటకు అవసరానికి మించి ఎరువు లు వేయ రాదు. దీంతో పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. పంటల సాగుపై ఆయా గ్రామాల్లో రైతులకు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం.