యాచారం, ఆగస్టు23: తులేఖుర్ధు నుంచి కొలన్గూడ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 2.57కోట్ల నిధులు మంజూరు అయినట్లు, త్వరలో పనులను ప్రారంభించనున్నట్లు గ్రామ సర్పంచ్ సామర్తి సబి త తెలిపారు. మండల కేంద్రంలో ఆమె సోమవారం టీఆర్ఎస్ నా యకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ…తులేఖుర్ధు నుంచి కొలన్గూడ వరకు రోడ్డు పూర్తిగా అధ్వాన్నంగా మారగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే రూ. 2కోట్ల, 57లక్షల50వేలు మంజూరు చేశారన్నారు. గ్రామానికి చెందిన అం బేద్కర్ యువజన సంఘం సభ్యులు నిధులు మంజూరయ్యాక రోడ్డు కోసం దీక్ష చేయడం సరైంది కాదన్నారు. తులేఖుర్ధు నుంచి సుమా రు ఐదుకిలోమీటర్ల రోడ్డు పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. త్వరలో యాచారం నుంచి చౌదర్పల్లి మీదుగా పూర్తి రోడ్డు నిర్మాణ పనులు సైతం ప్రారంభిస్తామన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్యపాల్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఈశ్వర్, ఎదటి రవిందర్, మల్లేశ్ న్నారు.