కొత్తూరు : విజయ గర్జనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పిలుపునిచ్చారు. అక్టోబర్ 15న నిర్వహించే టీఆర్ఎస్ విజయ గర్జన సన్నాహక సమావేశాన్ని మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షురాలు భగద్గీత ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చేనెల 15న వరంగల్‌లో నిర్వహించే విజయ గర్జనకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మున్సిపాలిటీలోని 12వార్డుల నుంచి 12 బస్సులు బయలు దేరాలన్నారు. ప్రతివార్డులో వార్డు కమిటీ అధ్యక్షుని ఆధ్వర్యంలో జన సమీకరణ చేయాలన్నారు. వార్డులోని కమిటీ సభ్యులంతా కలిసి జన గర్ణనకు సమాయత్తం కావాలన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌల్సిలర్లు, వార్టు కమిటీ అధ్యక్షులు సమన్వయంలో పనిచేసి పెద్ద ఎత్తున జన సమీవరణ చేయాలన్నారు.
టీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్యకర్తలు
టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి యువత పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు తిమ్మాపూర్, కుమ్మరిగూడకు చెందిన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణలో జరుగుతున్న అభవృద్ధి దేశంలోని మరే రాష్ట్రంలో లేదని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌల్సిలర్లు చంద్రకళ, కొస్గి శ్రీనివాస్, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, కొత్తూరు మున్సిపాలిటీ ఇన్చార్జి పెంటనోళ్ల యాదగిరి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ జంగగళ్ల శివకుమార్, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌యాదవ్, జనార్దనచారి, బ్యాగరి యాదయ్య, రవినాయక్, వార్డు అధ్యక్షులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తను పాల్గొన్నారు.