తుర్కయాంజాల్ : అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రైతుబీమా చేయూతనిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ తొరూర్ గ్రామానికి చెందిన రైతు మేకం భిక్షపతి గుండెపోటుతో మృతి చెందగా రైతుబీమా నుంచి వచ్చిన రూ. 5లక్షల చెక్కు ప్రొసిడింగ్‌ను ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం మృతుడి భార్య మేకం అలివేలుకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుబీమా తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతుందన్నారు. రైతు అకాల మరణం చెందితే ఆ కుంటుంబం రోడ్డున పడకుండా సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమాతో రైతు కుటుంబానికి భరోసా కల్పిస్తుందన్నారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధరాంరెడ్డి, వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరిత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ కందాడ ముత్యంరెడ్డి, తుర్కయాంజల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల అమరేందర్‌రెడ్డి, అబ్ధుల్లాపూర్‌మెట్ మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ కందాల బలదేవ రెడ్డి, మాజీ సర్పంచ్ మేకం అంజయ్య, నాయకులు పాల్గొన్నారు.