పరిగి : బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలతో స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుని, ఆర్థికంగా ఎదుగాలని డీఆర్డీవో కృష్ణన్, ఎల్డీఎం రాంబాబు, పరిగి జడ్పీటీసీ హరిప్రియ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ యూసుఫ్లు పేర్కొన్నారు. గురువారం పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలో నిర్వహించిన మహిళ మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు మంజూరైన రూ. 6కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులు వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతి సాధించాలన్నారు.
సకాలంలో రుణాలు తిరిగి చెల్లించడం ద్వారా ఇతరులకు రుణాలు తీసుకునే అవకాశం కల్పించాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలందరూ బీమా చేయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అశోక్వర్ధన్రెడ్డి, ఎంపీటీసీ పద్మమ్మ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రాజశేఖర్, ఫీల్డ్ ఆఫీసర్ కార్తిక్, ఐకెపి ఏపీఎంలు శ్రీనివాస్ రెడ్డి, సాయన్న, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.