కులకచర్ల, అక్టోబర్ 31 : రెండు సంవత్సరాల నుంచి కరువుతీరా వర్షాలు కురియడంతో రైతులు వానకాలంలో పెద్ద ఎత్తున వరి పంటను సాగుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగుపద్ధతులు తెలియజేసి వానకాలంలో వేయాల్సిన పంటల గురించి వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించడంతో మండలంలో ఎక్కువగా వరి పంటను సాగు చేశారు. జొన్న, రాగులతో పాటు ఇత పంటలు సాగుచేశారు. కులకచర్లమండలంలో 32 గ్రామ పంచాయతీలు ఉండగా చౌడాపూర్ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రెండు మండలాల్లో 28, 936 ఎకరాల విస్తీర్ణంలో వరి పంటను సాగుచేశారు. ప్రస్తుతం వరి కోత దశకు వస్తున్నది. కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో 17 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశారు. చౌడాపూర్ మండలంలో కొత్తపల్లి, అడవివెంకటాపూర్, చాకల్పల్లి, చౌడాపూర్, కన్మన్కల్వ, మల్కాపూర్, మరికల్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేశారు. కులకచర్ల మండలంలో కులకచర్ల 1, కులకచర్ల2, సాల్వీడ్, ముజాహిద్పూర్, పుట్టపహాడ్, కుస్మసముద్రం, బండవెల్కిచర్ల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేశారు. పై కొనుగోలు కేంద్రాలేకాకుండా ఈ సంవత్సరం మరో మూడు కొనుగోలు కేంద్రాలు కొత్తగా ఏర్పాటు చేశారు. అంతారం, తిర్మలాపూర్, వీరాపూర్ గ్రా మాల్లో కొత్తగా పీపీసీలు ఏర్పాటు చేశారు. కులకచర్ల మండలంలో ఏఎంసీ కొనుగోలు కేంద్రాలు కులకచర్ల, బండవెల్కిచర్ల, పీఏసీఎస్ ద్వారా అడవివెంకటాపూర్, చాకల్పల్లి, చౌడాపూర్, కన్మన్కల్వ, మల్కాపూర్, మరికల్, ముజాహిద్పూర్, పుట్టపహాడ్ గ్రామాలు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కుస్మసముద్రం పీపీసీ కాగా ఐకేపీ ఆధ్వర్యంలో కులకచర్ల, సాల్వీ డ్, కొత్తపల్లి కొనుగోలు కేంద్రాలను నిర్వహించేందుకు చర్యలు తీసు కుంటున్నారు.
15 రోజుల్లో వడ్ల సేకరణ….
కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో ఈ సారి వరి పంట పెద్ద మొత్తంలో సాగుచేశారు. మండలంలోని గ్రామాల్లో రైతులకు వారు పండించి ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కులకచర్ల, చౌడా పూర్ మండలాల్లో 17 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కూడా కొనుగోలుపై శిక్షణ కూడా అందించాం. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. రైతులకు ఆయా గ్రామాల్లో ఏఈవోలు టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్ల ప్రకారం రైతులు వారికి కేటాయించి తేదీల్లో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లాలి.
– వీరస్వామి, మండల వ్యవసాయశాఖ అధికారి కులకచర్ల