కొడండల్, సెప్టెంబర్ 19: కొడంగల్ నియోకవర్గంలోని అన్ని మండలాల నుంచి అం బేద్కర్ నాస్తిక్ సమాజ్, బహుజన సంఘాలు, స్వేరో సంఘాల నాయకులు పెద్ద ఎత్తున సోమవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తామంతా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వారంతా పార్టీ కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో కోస్గి మండలం నుంచి గౌరిగల్ల మౌర్య కృష్ణ, సర్జఖాన్‌పేట వార్డు సభ్యు రాలు మమత, వెంకట్రాములు, బొంరాస్‌పేట మండలం నుంచి డప్పు శ్రీనివాస్, కొడంగల్ మండలం నుంచి వెంకటేశ్, దౌల్తాబాద్ మండలం నుంచి బెల్లం అంజి, దుద్యాల మండలం నుంచి రాము, భారత నాస్తిక సమాజం నారాయణపేట జిల్లా అధ్యక్షుడు చిన్ని కృష్ణ, డప్పు నర్సింహ, పోలేపల్లి అంజి, నర్సాపూర్ నరేష్ శాంతి, మల్లేశ్, పండు, ఈశ్వర్, చౌదర్పల్లి నర్సింహులు, ప్రమోద్, శ్రీనివాస్, రాజేశ్, సుధాకర్, రాఘవేందర్‌తో పాటు 50 మంది ఉన్నారు.
సచివాలయానికి అంబేద్కర్ పేరుపై హర్షం
నూతన సచివాలయ భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదన పంపడం పట్ల సీఎంకేసీఆర్కు స్వేరో సర్కిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుప్పలి అశోక్ కుమార్, ,ఎరన్‌పల్లి శ్రీనివాస్ తదితర నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.