పెద్దేముల్, సెప్టెంబర్ 19: ప్రభుత్వ జూనియర్, మోడల్ కళాశాలల విద్యార్థులకు తెలం గాణ ప్రభుత్వం ఉచితంగా అందచేస్తున్న పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయడానికి ఆర్టీసీ కార్గో సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ జూనియర్, మోడల్ కళాశాలలకు పాఠ్య పుస్తకాలను ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల ద్వారా సరఫరా చేసేవారు. ప్రస్తుతం పాఠ్య పుస్తకాలను ఆర్టీసీ కార్గో సేవల ద్వారా నేరుగా ఆయా కళాశాలలకు, పాఠశాలలకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేప ట్టింది. దీంతో రవాణాలో ఇబ్బందులు తప్పడమే కాకుండా ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నది. తాండూరు నియోజకవర్గంలో ఐదు ఇంటర్మీడియట్ స్థాయి కళా శాలలు, పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల తాండూర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల పెద్దేముల్, మోడల్ స్కూల్ తాండూరు, మోడల్ స్కూల్ గొట్లపల్లి (పెద్దేముల్ )ఉన్నాయి. పెద్దేముల్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 852 ఇంటర్ సెకండియర్ పాఠ్య పుస్తకాలు, గొట్లపల్లి మోడల్ స్కూల్‌కు 180 ఇంటర్ సెకండియర్ పాఠ్య పుస్తకాలు మొత్తం 1,032 పాఠ్య పుస్తకాలు ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా చేరాయి. కార్గో సిబ్బంది నేరుగా ఆయా పాఠ శా లలు, కళాశాలలకు వెళ్లి పుస్తకాలను అందజేస్తున్నారు. జిల్లాలోని ప్రతి కళా శాల, పాఠశాలలకు ఆర్టీసీ కార్గో సేవల ద్వారా పుస్తకాల పంపిణీ కొనసా గుతున్నది. నేరుగా పుస్తకాలు చేరుతుండడంతో తమ ఇబ్బందులు దూరమవ్వ డంతో పాటు రవాణా ఖర్చుల భారం తగ్గిపోయిందని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు తొలగిపోయాయి
ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా నేరుగా పాఠ్య పుస్తకాలు పంపించడంతో రవాణా ఇబ్బందులు తీరడంతోపాటు, ఖర్చుల భారం తగ్గిపోయింది. ఇం టర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులకు, కార్గో సిబ్బందికి ధన్యవాదాలు.
– జి.నర్సింహులు,ప్రిన్సిపాల్, జూనియర్ కళాశాల
సమయానికి అందుతున్నాయి..
సమయానికి పుస్తకాలు చేరుతున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు వారు విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకొని పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడంతో ఆ సంఖ్య ప్ర కా రం కార్గో సిబ్బంది అందిస్తున్నారు. కార్గో సేవలు పాఠ శాలలు, కళాశాలలకు బాగా ఉపయోగపడుతున్నాయి.
-ఎర్ర రవీందర్, తెలుగు పండిత్ ,గొట్లపల్లి మోడల్ స్కూల్
అధికారుల ఆదేశాలతో..
ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు అందిస్తున్న ఇంటర్ పాఠ్య పుస్తకాలను సరఫరా చేయాలని అధికారులు ఆదే శాలు జారీ చేయడంతో నాకు అప్పగించిన రూట్లలో ప్రతి పాఠశాలకు, కళా శాలకు వెళ్లి పాఠ్య పుస్తకాల వివ రాలను సంబంధింత ప్రిన్సిపాల్లకు అందించి వారికి కేటా యించిన విధంగా పంపిణీ చేస్తున్నాను.
– ప్రేమ్‌కుమార్, కండక్టర్, రాణిగంజ్ బస్‌డిపో