రంగారెడ్డి, సెప్టెంబర్ 15, (నమస్తే తెలంగాణ): రాచరిక పాలన నుంచి ప్రజాస్వామిక పాలనలోకి అడుగుపెట్టి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ అంతటా సంబురాలు చేసేందుకు నిర్ణయించారు. తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే వజ్రోత్సవ వేడుకలను విజ యవంతం చేయాలని జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో ఇప్పటికే జిల్లా మంత్రి సబితారెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్స వాలు నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకుగాను జిల్లా కలెక్టర్ డి.అమయ్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో వేడుకలు అదిరిపోయేలా నిర్వహించేందుకుగాను ప్రతీ నియోజకవర్గానికి ఒక్కొ అధికారిని ఇన్చార్జిలుగా నియమించారు. జిల్లాలోని రెవెన్యూ డివి జినల్ అధికారు లను ఆయా నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్చార్జిలుగా జిల్లా కలెక్టర్ నియమించారు.
వజ్రోత్సవాల్లో భాగంగా నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వ హించనున్నారు. మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ర్యాలీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొంటుండగా, మిగతా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ర్యాలీల్లో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ర్యాలీల్లో విద్యార్థులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఇన్చార్జి అధికారులు చర్యలు చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న వారికి భోజన ఏర్పాట్లు చేశారు. 17న జిల్లా కలెక్టరేట్ వద్ద మంత్రి సబితారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. బంజారాహిల్స్‌లో నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు జిల్లా నుంచి 15 వేల మందిని తర లించేలా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు అన్ని మండల కేంద్రాల నుంచి గిరిజనులను తరలించడంతోపాటు వారికి తాగునీరు, భోజన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. చివరి రోజు ఈనెల 18వ తేదీన జిల్లా కేంద్రంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్య క్రమాలను నిర్వహించనున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ అమయ్‌కుమార్
నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే తెలంగాణ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డి.అమయ్‌కుమార్ తెలి పారు. తెలంగాణ వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకుగాను జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇన్చార్జిలను కూడా నియమించమన్నారు. ఈనెల 18న జిల్లా కేంద్రంలో తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్ జిల్లా పరిధిలో వజ్రోత్సవాల నిర్వహణకు జిల్లా కలెక్టర్ నిఖిల ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించారు. వికా రాబాద్ నియోజకవర్గానికి జిల్లా యువజన క్రీడల అధికారి, వికారాబాద్ డీఎస్పీ, ఆర్డీవో, పరిగి నియోజకవర్గానికి డీఆర్డీవో, పరిగి తహసీల్దార్, అదనపు ఎస్పీ, తాండూరు నియోజకవర్గానికి గిరిజన సంక్షేమ శాఖ అధికారి, తాండూరు ఆర్డీవో, డీఎస్పీ, కొడంగల్ నియోజకవర్గానికి జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, డీఎస్పీలను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. మొదటి రోజు శుక్రవారం వికారాబాద్‌లో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి బ్లాక్ గ్రౌండ్ వరకు పరిగిలో కొడంగల్ క్రాస్‌రోడ్డు నుంచి మినీ స్టేడియం వరకు, తాండూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విలెమూన్ స్కూల్ వరకు, కొడంగల్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలలో ప్రజా ప్రతిని ధులు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థులు పాల్గొంటారు. ప్రతి నియోజక వర్గానికి 14వేల చొప్పున జాతీయ జెండాలు అందించడంతో త్రివర్ణ పతాకాలు చేత పట్టుకొని ర్యాలీల్లో పాల్గొననున్నారు.
జాతీయ జెండా ఎగురవేయనున్న డిప్యూటీ స్పీకర్
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా 17వ తేదీ ఉదయం 9 గంటలకు వికారాబాద్‌లోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే కార్య క్రమంలో ముఖ్యఅతిథిగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. 17వ తేదీన జిల్లా స్థాయి, నియోజక వర్గ స్థాయిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే హైద రాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీ అధికారులు, సిబ్బంది, ఎస్టీ వర్గాల ప్రజలను తరలించ నున్నారు. వికారాబాద్ జిల్లా నుంచి 27 బస్సులు ఏర్పాటు చేశారు. ఈ వాహ నాలు ఉదయం 8 గంటలకు ఆయా మండల కేంద్రాల నుంచి బయలు దేరుతాయి. 18వ తేదీ ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లేదా అంబేద్కర్ భవనంలో కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు.
విజయవంతం చేయాలి: వికారాబాద్ కలెక్టర్ నిఖిల
వజ్రోత్సవ వేడుకలు విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈనెల 16 నుంచి 18 వరకు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా గురువా రం నిర్వహించే ప్రదేశాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయం నుంచి సంగెం లక్ష్మీబాయి పాఠశాల వరకు భారీ ర్యాలీ ఉంటుందని దీనికి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ర్యాలీలో పాల్గొనే వారందరికీ గౌలీకార్ ఫంక్షన్ హాల్లో భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.