న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ:స్వరాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోని వెళ్తే జాతీయ స్థాయిలోనూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం పెరుగుతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు అభిప్రాయపడుతున్నా రు. ఎనిమిదేండ్ల పాలన లో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని పేర్కొంటున్నారు.తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశం లోని ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారని.. ఇక్కడ అమలవుతున్న పథకాలు తమకూ కావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చావునోట్లో తలపెట్టి సాధించిన తెలంగాణను అనతికాలంలోనే దేశమంతా చూసేలా ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడుతున్నారు. రాష్ట్రం లో అమలవుతున్న సంక్షేమ ఫలాలు దేశమంతా అందాలంటే అందుకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని, జాతీయ స్థాయిలో పార్టీని స్థాపించాలని ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడి న తర్వాత గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని..ప్రతినెలా నిధులను విడుదల చేస్తూ గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తున్నారన్నారు. లోతైన అధ్యయనం, బలమైన సంకల్పం, స్పష్టమైన వ్యూహంతో లక్ష్య సాధన దిశగా సాగే కేసీఆర్‌తో ఏదైనా సాధ్యమేనని, మున్ముందు దేశ రాజకీయాల్లో కీలక మార్పులు రానున్నాయని వారు పేర్కొంటున్నారు.
సీఎం కేసీఆర్‌తోనే సుస్థిర అభివృద్ధి సాధ్యం
సీఎం కేసీఆర్‌తోనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఒక రోల్ మోడల్ తెలంగాణ. దేశ అభివృద్ధి, వనరుల లభ్యత వాటి వినియోగం పై స్పష్టమైన అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా దేశంలో ఇంకా చెప్పుకోదగ్గ అభివృద్ధి జరుగలేదు. మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పోరాడి సాధించిన తెలంగాణను ఎనిమిదేండ్లలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అనేక పథకాలను అమ లు చేస్తూ అందరికీ అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది.
– కరణం అరవిందరావు, ఎంపీపీ, పరిగి
అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది
కేసీఆర్ లాంటి ముం దుచూపున్న నేత దేశ రాజకీయాల్లోని వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభు త్వం సంపన్న వర్గాలకు మేలు చేసేలా పాలన సాగిస్తున్నది. రైతులకు 24 గంటలపాటు ఉచిత కరెంట్, రైతుబీమా, ప్రాజెక్టుల నిర్మాణం, పం డించిన పంటలకు మద్దతు ధర వంటివి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని తెలంగాణలో నిరూపితమైనది. దేశంలో సమానత్వం, నిధుల కేటాయింపు వంటివి పక్కాగా అమలు కావాలంటే కేసీఆర్ కేంద్రంలో ఉంటేనే సాధ్యమవుతుంది.
– కాలె భవాని, ఎంపీపీ, నవాబుపేట
భావితరాలు బాగు పడుతాయి
భావితరాలు బాగుపడాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించేవరకూ ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను చౌకగా అమ్ముతూ, పేదలను దోచుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంపదను అంతా కొద్దిమందికే కట్టబెడుతున్నది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశవ్యాప్తంగా ఈ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయి.
పబ్బే మధుకర్, జడ్పీటీసీ మర్పల్లి మండలం
జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే..
తెలంగాణ స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం హర్షణీయం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ అదే స్ఫూర్తి తో దేశ రాజకీయాల్లోనూ రాణిస్తారన్న నమ్మకం ఉన్నది. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి రైతుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లో ఉండటం ఎంతో అవసరం. సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒంటెత్తు పోకడలకు బ్రేకులు పడుతాయి.
– రాందాస్‌నాయక్,జడ్పీటీసీ కులకచర్ల మండలం
సమయం ఆసన్నమైనది..
దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైనది. అభివృద్ధిలో దేశంలోనే రాష్ర్టాన్ని ఆయన ముందంజలో నిలిపారు. యావత్ దేశ ప్రజలు తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నారు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు తమకూ కావాలని కోరుతున్నారు. ముందు చూపు గలిగిన వ్యక్తిగా దేశాన్ని ముందంజలో నడిపే శక్తి సీఎం కేసీఆర్‌కు ఉన్నది. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో పేదోడు మరింత పేదగా మారుతుండగా, ఉన్నోడు మరిన్ని ఆస్తులను కూడబెట్టుకుంటున్నాడు. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేస్తున్నది.
– జంగమ్మ, జడ్పీటీసీ, యాచారం మండలం
దేశ ప్రజలంతా తెలంగాణ వైపు చూస్తున్నారు
దేశ ప్రజలంతా తెలంగాణ వైపు చూస్తున్నా రు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశం సిస్తున్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని, తెలంగాణలో అమలవుతున్న సంక్షే మ పథకాలు మాకు కూడా అందించాలని కోరుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలు, కార్మికులు, మైనార్టీలు, పేద ప్రజలు బీజేపీ పాలనలో బతకలేకపోతున్నారు. సామాన్యుల జీవన పరిస్థితి దుర్భరంగా మారింది. సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. నవ భారత నిర్మాణం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. బీజేపీని పాతర వేసే శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉన్నది.
రైతుబాంధవుడు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగు పెడుతుండటం శుభపరిణామం. రైతుల బాగుకో సం ఆలోచించి దేశంలో ఎక్కడా లేని విధంగా నిరంతర ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి సాయం, రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. రైతుల మేలు కోరే సీఎం ఆయన. అలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు ఇం కా ఎన్నో పథకాలు అమలవుతాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలంటే సీఎం కేసీఆర్ ప్రధాని కావాలి.
– నక్షత్రం జయవంత్, ఎంపీపీ , మొయినాబాద్
సీఎం కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి ..
దేశాభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం అవుతుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ప్రస్తుత బీజేపీ పాలనలో దేశం అస్తవ్యస్తంగా మారింది. ఈ తరుణంలో సరైన నాయకత్వం, సమర్థ పాలన కేసీఆర్‌తోనే సాధ్యమని దేశ ప్రజలందరూ నమ్ముతున్నారు. ఆయన దేశ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. ఆయన ఏర్పాటు చేయనున్న పార్టీకి పూర్తి మద్ద్దతు తెలుపుతున్నా. అందరి సంక్షేమం కోసం పాటుపడే సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశ ప్రజలందరికీ అందాలంటే ఆయన ప్రధాని కావాల్సిందే.
-విజయలక్ష్మీ రమణారెడ్డి,చేవెళ్ల ఎంపీపీ
దేశానికి సీఎం కేసీఆర్ సేవలు అవసరం
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తేనే బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సేవలు దేశానికి ఎంతో అవసరం. భారతదేశం అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నది. దీనికి కారణం ప్రధాని మోదీ విధానాలే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో
వెళ్తే దేశ రూపురేఖలు పూర్తిగా మారుతాయి. అన తి కాలంలోనే రాష్ర్టాన్ని ఎలా అభివృద్ధి చేశారో అదేవిధంగా దేశం కూడా ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో పక్కాగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో తన కంటూ ప్ర త్యేక సత్తాను ఆయన చాటుతారు.
– గౌడి మంజుల, జడ్పీటీసీ, తాండూరు