బడంగ్‌పేట, సెప్టెంబర్ 4: అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వానికి రెండు కండ్ల లాంటివని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో ఉన్న వైఎస్సార్ గార్డెన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేసి, అనంతరం పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమ న్నారు. కొవిడ్ కాలంలోనూ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాయని.. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని కొనియాడా రు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పరిపాల న సాగుతున్నదన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గౌడ కులస్తులు, చేనేత, కిడ్నీ రోగులు తదితరులకు ఆసరా పింఛన్‌ను అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఒంటరి మహిళలకు పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. అందరికీ పింఛన్లు పంపిణీ చేస్తూ ఇంటి పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలో 1.57 లక్షల మందికి ఆసరా పిం ఛన్లు అందుతున్నాయని.. ఇందుకోసం ప్రతినెలా ప్రభుత్వం రూ.53 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాతానర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాంశేఖర్, కార్పొరేటర్లు పవన్‌కుమార్, అర్జున్, శివకుమార్, స్వప్నాజంగారెడ్డి, మనోహర్, ప్రభాకర్‌రెడ్డి, స్వప్నా వెంకట్‌రెడ్డి, మమతాకృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.