షాద్‌నగర్, సెప్టెంబర్ 3: అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ కార్డులను అందజేస్తామని ఎమ్మెల్యే వై. అంయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో శనివారం లబ్ధిదారులకు నూతన ఆసరా కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ ఆసరా పథకాన్ని షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో 2014 నవంబర్ 8న ప్రారంభించారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 200 పింఛన్‌ను పంపిణీ చేసిందని, కానీ ఒంటరి మహిళలకు, చేనేత, గౌడులకు ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 10 ఇంతలు పెంచి పింఛన్ పంపిణీ చేసిందనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రూ. 2016, దివ్యాంగులకు రూ. 3016ల పింఛణ్ అందజేస్తుందన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, సర్వర్‌పాషా, నర్సింహ, రాజేశ్వర్, ప్రతాప్‌రెడ్డి, కొందూటి మహేశ్వరి, నడికూడ సరిత, కృష్ణవేణి, శాంతమ్మ, అంతయ్య, కో ఆప్షన్ సభ్యుడు కిషోర్, నాయకులు మన్నె నారాయణ, యుగేందర్, నర్సింహులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : గణేశ్ నవరాత్రోత్సవాలతో షాద్‌నగర్ పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని ఆనంద్‌కాలనీ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాధుడి వద్ద, కేశంపేట్రోడ్డులోని శివాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
అంతకు ముందు జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు సలేంద్రం రాజేశ్వర్, జీ.టీ శ్రీనివాస్‌తో కలిసి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నా రు. కార్యక్రమంలో నారాయణ, సుధాకర్, వెంకట్‌రెడ్డి, ఆ నంద్కాలనీ వినాయక సేవా సమితి అధ్యక్షుడు ప్రభులింగం, సభ్యులు వెంకటేశ్, విఠల్, రాఘవేందర్, రాములు, చిన్మ య్య, ఆంజనేయులు, బంటి, సాయి, భాస్కర్ పాల్గొన్నారు.
కేశంపేట : రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం రిలీఫ్‌ఫండ్ పథకం బాసటగా నిలుస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని చింతకుంటపల్లికి చెందిన చెన్నమ్మకు రూ.60 వేలు, నర్సమ్మకు రూ.15 వేలు, ఆనంద్‌కుమార్‌కు రూ.11 వేలు, వేములనర్వ గ్రామానికి చెందిన శేఖర్‌గౌడ్‌కు రూ.60 వేలు, అమృతకు రూ.60 వేలు, మంగమ్మకు రూ.48 వేలు, పాపిరెడ్డిగూడకు చెందిన సువర్ణకు రూ. 30 వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనురాధ, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, సర్పంచ్‌లు నవీన్‌కుమార్, శ్రీలత, ఎంపీటీసీ మల్లేశ్‌యాదవ్, పార్టీ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు పర్వత్‌రెడ్డి, రమేశ్‌యాదవ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.