కులకచర్ల, మార్చి 14: ఆలయ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పాంబండ రామలింగేశ్వరస్వామి ఆలయ ఈవో సుధాకర్, చైర్మన్ రాములు హెచ్చరించారు. సోమవారం పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ.. ఆలయం చుట్టూ ఉన్న భూములను ఆక్రమించేందు కు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై కులకచర్ల తహసీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
పాంబండపై టెంకాయల వేలం పాట
మండల పరిధిలోని పాంబండ రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం టెంకాయల వేలం పాట జరిగింది. ఆలయ ఈవో సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ రాములు ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగనున్న ఆలయ బ్రహ్మోత్సవాల్లో టెంకాయలను విక్రయించుకునేందుకు శ్రీరాంవీరేశ్ అనే వ్యక్తి రూ 3,80,000 వేలంలో దక్కించుకున్నారు. అదేవిధంగా ఏడాదిపాటు టెంకాయలను ఆలయ ఆవరణలో విక్రయించుకునేందుకు బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన శివుడు రూ.5,28,000 వేలంలో దక్కించుకున్నాడు. కార్యక్రమంలో పర్యవేక్షకుడు బాల్‌రాజ్, గ్రామస్తులు, కమిటీ సభ్యుడు, అర్చకులు పాండుశర్మ తదితరులు పాల్గొన్నారు.