తాండూరు, ఆగస్టు 29: గణేశ్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకో వాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. సోమవారం తాండూ రు పట్టణంలోని తులసీ గార్డెన్లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జరిగిన వినాయక ఉత్సవాల శాంతి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుం డా పోలీస్ ప్రత్యేక బృందాలతోపాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామ న్నారు.
నిర్వాహకులు మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగ్గా పోలీసుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. నిమజ్జనానికి 24 గంటల ముందే పట్టణం, పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదన్నా రు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం తాండూరు మున్సిపల్ చైర్పర్సన్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ కుల, మత భేదాల్లేకుండా అందరం పండుగలను ప్రశాంతంగా.. సంతోషంగా చేసుకుందామన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుం టామని ..మున్సిపల్‌కు సంబంధించిన రోడ్లను వెంటనే బాగు చేస్తామన్నారు.
హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి నర్సింహులు మాట్లాడుతూ భారీ విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా భక్తితో ఆలోచించి పర్యావరణానికి ముప్పు కలుగని మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తే బాగుంటుందన్నారు. భక్తులు, ప్రజల కు ఇబ్బందులు కలుగకుండా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వలంటీర్లు, పోలీసుల సహకారంతో నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తామన్నారు. అంతకుముందు వినాయక ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలనే విషయమై పట్టణ పురప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు, కుల సంఘాల ప్రతినిధులు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజూగౌడ్, డీఎస్పీ శేఖర్‌గౌడ్, సీఐ రాజేందర్‌రెడ్డి, అగ్నిమాపక కేంద్రం ఆఫీసర్ నాగార్జున, తహసీల్దార్ చిన్నప్పలనాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ దీప, రాజకీయ పార్టీల నేతలు, కులసంఘాల ప్రతినిధులు, వినాయక మండపాల నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.