మర్పల్లి, ఆగస్టు 28: మర్పల్లి మండల పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్ గుప్తా తల్లి ప్రమీలాదేవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఆదివారం ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్‌రెడ్డితో కలిసి ప్రమీలా దేవి ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే మండల పరిధిలోని బిల్కల్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ యేసమ్మ భర్త నర్సింహులు ఇటీవల దవాఖానలో చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చాడు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్‌రెడ్డితో కలిసి బిల్కల్ గ్రామంలోని నర్సింహులు ఇంటికి వెళ్లి ఆయన ఆరో గ్యపరిస్థితిని అడిగి తెలుసుకుని రూ. 20 వేల ఆర్థిక సాయం అందజేశారు.
అలాగే అదే గ్రామానికి చెందిన ఈసీ విఠల్ కుమారుడు రవితేజ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంట్లో ఉండగా అతడ్ని కూడా పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ లలితా రమేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామే శ్వర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఫసీయుద్ధీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రవి, అనంత్‌రెడ్డి, సర్పంచులు ధరమ్‌సింగ్, శంకర్, ఎంపీటీసీలు సురేశ్, రవీందర్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు మజార్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు సురేశ్ కుమార్, నాయకులు బట్టు రమేశ్, రవివర్మ, రతన్, సుధాకర్, రవీం దర్‌రెడ్డి, ప్రమోద్, కర్నె రాజు, పాండు రంగారెడ్డి, ఎం.రమేశ్, మాణిక్‌రెడ్డి, అంజన్న తదితరులు పాల్గొన్నారు..