కొడంగల్, ఆగస్టు 26: ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అనంతమని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్, మండల పరిధిలో పర్యటించి లబ్ధిదారులకు కొత్త ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి బిడ్డ ను సంతోషంగా చూడాలన్నదే సీఎం ఆకాంక్షన్నారు. ఆయన ఎల్లప్పుడు ప్రజా సంక్షేమం కోసం ఆలో చిస్తూ ఉండటం వల్లే నేడు ఎన్నో అద్భుత పథకాలను అందుకోగలుగుతున్నట్లు తెలిపారు. పింఛన్లు అందు కున్న వృద్ధులు సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. నాడు వృద్ధాప్యంలో మందులు, ఇతరాత్ర అవసరాలకు ఒకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు అటువంటి పరిస్థితి లేదని ఆసరా పథకం వృద్ధుల్లో ఆత్మగౌరవాన్ని నింపినట్ల్లు తెలి పారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని ఐనాన్పల్లి గ్రామంలో రూ.80లక్షల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్డును శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్లు మధుసూదన్‌యాదవ్, డా.శ్రీలతాయాదవ్, ప్రభాకర్‌గౌడ్, వెంకట్‌రెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్‌లు సయ్యద్ అంజద్, పకీరప్ప, గోవింద్, పట్లోళ్ల వెంకటలక్ష్మితో పాటు టీఆర్ఎస్ నాయకులు సిద్దిలింగప్ప, నవాజోద్దిన్, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
దళితబంధుతో ఆర్థికాభివృద్ధి..
అన్ని వర్గాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమని సీఎం కేసీఆర్ ప్రతి వర్గానికి ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలో దళితబంధు పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్‌ను బొంరాస్‌పేట మండలంలోని రేగడిమైల్వార్ గ్రామ లబ్ధిదారుడికి అందజేశారు. అదేవిధంగా కొడంగల్ మండలం అంగడిరైచూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలను ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామన్నారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతంతోనే తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా పార్టీ పటిష్టతకు పాటు పడదామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.