ఇబ్రహీంపట్నం,ఆదిబట్ల : రంగారెడ్డిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావడంతో కొంగరకలాన్ జనసంద్రమైంది. రంగారెడ్డిజిల్లా నలుమూలల నుంచి ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావడంతో బహిరంగ సభకు ఊహించని రీతిలో స్పందన లభించింది. సీఎం కేసీఆర్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల ప్రజలు మధ్యాహ్నం 2 గంటలకే బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు. సీఎం చేరుకునేలోపు 60వేల మందికి పైగా చేరుకున్నారు. కొంతమంది కొంగరకలాన్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో నిలిచిపోయారు. పెద్దఎత్తున ప్రజలు హాజరుకావడంతో సీఎం తన ప్రసంగాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. సీఎం ప్రసంగించినంత సేపు ఈలలు, కేరింతలతో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
రోడ్డు మార్గానే ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్ హెలీకాప్టర్ ద్వారా రావాల్సి ఉండగా.. రోడ్డు మార్గానే కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి చేరుకున్నారు. తిరిగి రోడ్డు మార్గానే హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
పాల్గొన్న 450 మంది వలంటీర్లు
ముఖ్యమంత్రి బహిరంగ సభ విజయవంతం చేయడంలో బంటి యూత్ ఫోర్స్ కు చెందిన సుమారు 450 మంది యువకులు వలంటీర్లుగా విధులు నిర్వహించారు. మూడు రోజులుగా బహిరంగ సభాస్థలి ఏర్పాట్లు, సభకు విచ్చేసిన ప్రజలకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందచేశారు. బహిరంగ సభకు ప్రజలను తరలించడంతోపాటు వారు క్షేమంగా గ్రామాలకు తరలివెళ్లేందుకు కృషిచేశారు. వలంటీర్ల కృషిని మంత్రి, ఎమ్మెల్యే అభినందించారు.
సీఎం పర్యటన విజయవంతం
కలెక్టరేట్ ప్రారంభం విజయవంతం కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మూడు రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు ముఖ్యమంత్రి రాక సందర్బంగా ఏర్పాట్లలో తలమునకలైనారు. మరోవైపు పోలీసు యంత్రాంగం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ మహేశ్‌భగవత్‌తో పాటు పలువురు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.
బహిరంగ సభలో పాల్గొన్న ప్రముఖులు
బహిరంగ సభలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, కౌశ్క్రెడ్డి, నారాయణరెడ్డి, వాణీదేవి, దయానంద్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, గుర్క జైపాల్‌యాదవ్, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, మల్లేశ్, వెంకట రమణారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్, ఐటీఐని ఏర్పాటు చేయాలి
మంచాల మండలంలోని రంగాపూర్, జాపాల అబ్జర్వెటరీ ప్రాంతంలో పాల్టెక్నిక్, ఐటీఐ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ ప్రాంతంలోని యువతకు అవసరమైన వృత్తి విద్యా కళాశాల, ఐటీఐ ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. ఖగోళశాస్త్ర పరిశోధన కోసం గతంలో ప్రభుత్వం అబ్జర్వేటరీకి స్థలం కేటాయించిందని.. చాలా స్థలం వృథాగా ఉన్నందున ఈ స్థలంలో పాలిటెక్నిక్, ఐటీఐ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఇచ్చే నిధులను రూ.15 కోట్లకు పెంచడంపై విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటివరకు నియోజకవర్గాల అభివృద్ధికి రూ.5కోట్ల నిధులివ్వగా, ఎమ్మెల్యేలకు మరో రూ.10కోట్ల నిధులిచ్చేందుకు సీఎం ప్రకటించడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం పర్యటనలో కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎంపీ, జడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు ధన్యవాదాలు తెలిపారు.
బహిరంగ సభకు బోనాలతో మహిళలు
కొంగరకలాన్ గ్రామానికి చెందిన కల్వకోల్ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పెద్దఎత్తున బోనాలు ఎత్తుకొని బహిరంగ సభకు హాజరయ్యారు. బోనాలకు ముందు ఒగ్గు కళాకారులు, పోతరాజులు పెద్దఎత్తున నృత్యాలు చేసి బహిరంగ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బోనాలతో వచ్చిన మహిళలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్వాగతం పలికారు. కొంగరకలాన్తండాతో పాటు మంచాల మండలంలోని పలు గిరిజన తండాలకు చెందిన గిరిజన మహిళలు గిరిజన వేషధారణలతో సభాస్థలికి చేరుకున్నారు. సభకు పలు గ్రామాల నుంచి మహిళలు స్వచ్ఛందంగా హాజరయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన హైలైట్స్..