రంగారెడ్డి, ఆగస్టు 2, (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులను మంజూరు చేసింది. జిల్లాలో రోడ్డులేని గ్రామమంటూ లేనివిధంగా జిల్లాలో రోడ్ల అభివృద్ధి జరిగింది. జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్లను కూడా నిర్మించి రోడ్ల అభివృద్ధికి నిధులిచ్చారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ సీసీ రోడ్లను నిర్మించారు. ప్రతి గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి రోడ్లను నిర్మించారు. సమైక్య పాలనలో జిల్లాలోని అత్యధిక గ్రామాలకు రోడ్లులేని పరిస్థితి ఉండేది. కేవలం అరకొర నిధులను మాత్రమే కేటాయించేవారు. కనీసం రోడ్డ మరమ్మతులకు కూడా నిధులివ్వని దుస్థితి ఉండడంతో గుంతల రోడ్లతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొని ఉండేది. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో సీసీ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్అండ్బీ రోడ్లతో జిల్లాలో రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో 1094 కిలోమీటర్లకు సంబంధించి 64 రహదారుల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. రోడ్ల మరమ్మతులకు ఎనిమిదేండ్లకు జిల్లాకు రూ.300 కోట్లపైనే నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం గమనార్హం.
రూ.947 కోట్లతో ఆర్అండ్బీ రోడ్ల పనులు
టీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాలోని రోడ్లకు మహర్దశ వచ్చింది. జిల్లావ్యాప్తంగా గత రెండేండ్లలో 1094 కి.మీ మేర రోడ్ల అభివృద్ధికిగాను 64 రహదారుల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణానికి పనులను మంజూరు చేసింది. ఇప్పటివరకు 16 రహదారుల పనులు పూర్తికాగా, మరో 23 రహదారుల పనులు పురోగతిలో ఉండగా, 5 రహదారుల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తై పనులు ప్రారంభించాల్సి ఉంది. మరో 20 పనులకు సంబంధించి టెండర్ల దశలో ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
జిల్లాలో ఇప్పటివరకు పూర్తైన పలు పనులు
1.ఇబ్రహీంపట్నం నియోజకవర్గం హయత్‌నగర్ నుంచి అనాజ్‌పూర్ రోడ్డు వెడల్పు
2. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆర్సీఐ గేటు నుంచి మీర్ఖాన్పేట్ రావిర్యాల, కొంగరకలాన్-తిమ్మాపూర్, మాదాపూర్, గుమ్మడివల్లి, ఆకులమైలారం వరకు మరమ్మతులు
3. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సాగర్ పీడబ్యూడీ నుంచి (మంగళ్‌పల్లి, పోచారం, ఎలిమినేడు రోడ్ల మరమ్మతులు)
4. మహేశ్వరం నియోజకవర్గం శంషాబాద్ నుంచి కోళ్లపడకల్ వరకు రోడ్డ మరమ్మతులు
5. మహేశ్వరం నియోజకవర్గంలో హైదరాబాద్ నుంచి ఫార్మాసిటీ వరకు రోడ్డు వెడల్పు
6. చేవెళ్ల నియోజకవర్గం అంధపూర్ బ్రాంచ్ రోడ్డు వెడల్పు, పటిష్ట పనులు
7. షాద్‌నగర్ నియోజకవర్గం జేపీ దర్గా గేట్ నుంచి జేపీ దర్గా వరకు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ వరకు ఉన్న రహదారి బలోపేత పనులు
ఆర్అండ్బీ రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల అభివృద్ధికి రూ.947 కోట్ల నిధులు
1094 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి జరుగుతున్న పనులు
జిల్లావ్యాప్తంగా 64 పనులు మంజూరుకాగా, 16 పనులు పూర్తి
పురోగతిలో మిగతా రోడ్ల అభివృద్ధి పనులు
అన్ని రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులను మంజూరు చేసింది. జిల్లాలో రోడ్డులేని గ్రామమంటూ లేనివిధంగా జిల్లాలో రోడ్ల అభివృద్ధి జరిగింది. జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్లను కూడా నిర్మించి రోడ్ల అభివృద్ధికి నిధులిచ్చారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ సీసీ రోడ్లను నిర్మించారు. ప్రతి గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి రోడ్లను నిర్మించారు. సమైక్య పాలనలో జిల్లాలోని అత్యధిక గ్రామాలకు రోడ్లులేని పరిస్థితి ఉండేది. కేవలం అరకొర నిధులను మాత్రమే కేటాయించేవారు. కనీసం రోడ్డ మరమ్మతులకు కూడా నిధులివ్వని దుస్థితి ఉండడంతో గుంతల రోడ్లతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొని ఉండేది. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో సీసీ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్అండ్బీ రోడ్లతో జిల్లాలో రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో 1094 కిలోమీటర్లకు సంబంధించి 64 రహదారుల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. రోడ్ల మరమ్మతులకు ఎనిమిదేండ్లకు జిల్లాకు రూ.300 కోట్లపైనే నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం గమనార్హం.
రూ.947 కోట్లతో ఆర్అండ్బీ రోడ్ల పనులు
టీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాలోని రోడ్లకు మహర్దశ వచ్చింది. జిల్లావ్యాప్తంగా గత రెండేండ్లలో 1094 కి.మీ మేర రోడ్ల అభివృద్ధికిగాను 64 రహదారుల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణానికి పనులను మంజూరు చేసింది. ఇప్పటివరకు 16 రహదారుల పనులు పూర్తికాగా, మరో 23 రహదారుల పనులు పురోగతిలో ఉండగా, 5 రహదారుల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తై పనులు ప్రారంభించాల్సి ఉంది. మరో 20 పనులకు సంబంధించి టెండర్ల దశలో ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
జిల్లాలో ఇప్పటివరకు పూర్తైన పలు పనులు
1.ఇబ్రహీంపట్నం నియోజకవర్గం హయత్‌నగర్ నుంచి అనాజ్‌పూర్ రోడ్డు వెడల్పు
2. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆర్సీఐ గేటు నుంచి మీర్ఖాన్పేట్ రావిర్యాల, కొంగరకలాన్-తిమ్మాపూర్, మాదాపూర్, గుమ్మడివల్లి, ఆకులమైలారం వరకు మరమ్మతులు
3. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సాగర్ పీడబ్యూడీ నుంచి (మంగళ్‌పల్లి, పోచారం, ఎలిమినేడు రోడ్ల మరమ్మతులు)
4. మహేశ్వరం నియోజకవర్గం శంషాబాద్ నుంచి కోళ్లపడకల్ వరకు రోడ్డ మరమ్మతులు
5. మహేశ్వరం నియోజకవర్గంలో హైదరాబాద్ నుంచి ఫార్మాసిటీ వరకు రోడ్డు వెడల్పు
6. చేవెళ్ల నియోజకవర్గం అంధపూర్ బ్రాంచ్ రోడ్డు వెడల్పు, పటిష్ట పనులు
7. షాద్‌నగర్ నియోజకవర్గం జేపీ దర్గా గేట్ నుంచి జేపీ దర్గా వరకు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ వరకు ఉన్న రహదారి బలోపేత పనులు
రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ భారీగా నిధులు విడుదల చేస్తున్నది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని రోడ్లకు మహర్దశ వచ్చింది. గతంలో ఏడాదికి రూ.2-3 కోట్ల నిధులతోనే సరిపెట్టేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి గ్రామాలకు లింక్ రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు ప్రతి గ్రామపంచాయతీలో పల్లెప్రగతిలో భాగంగా సీసీ రోడ్లను నిర్మించారు. ఆర్అండ్బీ రోడ్ల విస్తరణ, నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేయగా, పనులు వేగంగా జరుగుతున్నాయి.