సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డును సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే రూ.1000కోట్లు దాటింది బల్దియా చరిత్రలోనే ఈ స్థాయిలో వసూలు కావడం ఇదే ప్రప్రథమని అధికారులు చెబుతున్నారు. 2020 సంవత్సరంలో దాదాపుగా రూ. 750 కోట్లు రాగా, 2021 సంవత్సరంలో సుమారు రూ.670కోట్లు రాబట్టారు. ముఖ్యంగా గతంలో రెండు నెలల పాటు ఎర్లీబర్డ్ స్కీం అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం పెద్దగా రాలేదు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌లో ఎర్లీబర్డ్ స్కీం ద్వారా ఏకంగా రూ. 741.35కోట్ల మేర ఆదాయం సమకూరడం గమనార్హం. ఆస్తిపన్ను వసూళ్లలో నిరంతరం పర్యవేక్షణ, బకాయిల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ఫలితంగానే నాలుగు నెలల్లోనే రూ.1000కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు చెప్పారు. రూ. 2000కోట్ల నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటికే 50శాతం అధిగమించామని, రాబోయే 8 నెలల పాటు ఆస్తిపన్ను వసూళ్లలో మరింత వేగం పెంచుతామని చెబుతున్నారు.
ఆస్తిపన్ను చెల్లించండి ఇలా..
urlకు వెళ్లండి.. httpsఃptghmconline payment.cgg.in/ptonlinepayment.do 10 అంకెల పీటీఐఎన్(ptin), మొబైల్ నంబరు, ఇ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. మై జీహెచ్ఎంసీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పేమెంట్ చేయవచ్చు. ఓటీఎస్ స్కీంపై విస్తృత ప్రచారం చేయడంతో పాటుగా ప్రతి వారం మంగళవారం, గురువారం, ఆదివారం ఆయా సర్కిల్ కార్యాలయాల్లో రెవెన్యూ మేళాలు నిర్వహించనున్నామని అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వ రాయితీ సద్వినియోగం
ఆస్తిపన్ను చెల్లించని యజమానులకు బకాయిలు చెల్లించేందుకు వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2021-22 సంవత్సరం వరకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిల మొత్తాన్ని కేవలం 10శాతం వడ్డీతో ఏకకాలంలో పూర్తి చెల్లించి, వడ్డీపై 90శాతం మాఫీని పొం దే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఈనెల 1 నుంచి వచ్చే అక్టోబరు 31వరకు ఈ స్కీం అందుబాటులో ఉంటు ందని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొనగా, గడిచిన రెండు రోజులుగా 107 10 మంది యజమానులు ఓటీఎస్ స్కీంను సద్వినియోగం చేసుకున్నారు. ఓటీఎస్‌తో రూ.16.09కోట్ల అదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.