వికారాబాద్, ఆగస్టు 1: వికారాబాద్‌లో సోమవారం ఉదయం వర్షం కురిసింది. శివ సాగర్ చెరువులోకి వరద నీరు చేరింది. వికారాబాద్ సమీపంలోని కొంపల్లి చెరు వులోకి నీరు చేరి అలుగు పారుతున్నది. వికారాబాద్ నుంచి కొంపల్లికి వెళ్లే ప్రధాన రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తున్నది. సర్పన్‌పల్లి చెరువులో వరద నీరు చేరడంతో అలుగు పారి నీరు ఉధృతంగా పారుతున్నది. వికారాబాద్‌తో పాటు ఆయా మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నీరు ఉధృతంగా పారడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
కోట్‌పల్లి, ఆగస్టు 1: భారీ వర్షానికి కంకణాలపల్లి, ఎన్నారం, కోట్‌పల్లి, కొత్తపల్లి, నాగ సాన్‌పల్లి, మోత్కుపల్లి తదితర గ్రామాల్లోని వాగులు పొంగి పొర్లుతున్నాయి.ఎన్నారం వాగు ఏకంగా బిడ్జ్రిపై నుంచి ఉధృతంగా పారింది. కోట్‌పల్లిలో సోమవారం సంత కావడంతో కూరగాయల వ్యాపారులు వర్షంతో ఇబ్బందులు పడ్డారు.
మర్పల్లి, ఆగస్టు 1: మర్పల్లి మండలంలో కల్ఖోడా, షాపూర్‌తండా, రావులపల్లి, తిమ్మా పూర్, సిరిపురం, దామస్తాపూర్ తదితర గ్రామాల వాగుల్లోకి పెద్ద ఎత్తున వరద నీళ్లు రావడంతో సమీప బ్రిడ్జీలపై నుంచి ఉధృతంగా ప్రవహించాయి. దీంతో రాకపోకలు స్థం భించి పోయాయి, దామస్తాపూర్ గ్రామంలో పట్లోళ్ల బక్కరెడ్డి పత్తి పొలంలో నుంచి వరద నీళ్లు వెళ్లడంతో రెండు ఎకరాల పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నది. తిమ్మాపూర్, రావులపల్లి వాగులను ఎంపీడీవో జగన్నాథ్ రెడ్డి, ఏపీవో అంజిరెడ్డి, ఏపీఎం మధుకర్‌తో కలిసి సంద ర్శించి పరిశీలించారు. వరద నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ట్రాక్టర్‌ను రోడ్డుకు అడ్డం పెట్టి రాకపోకలు నిలిపివేశారు.
ధారూరు,ఆగస్టు 1: ధారూరు మండల పరిధిలో నాగసముందర్, రుద్రారం, దోర్నాల్, ధా రూరు స్టేషన్ లమధ్య గల వాగులు వరదతో పొంగిపోవడంతో రాకపోకలు నిలిచి పో యాయి. గంటసేపు కురిసిన వర్షానికి నాగసముందర్- రుద్రారం గ్రామాల మధ్య కోట్ పల్లి వాగు పొంగి పోర్లడంతో సీఐ తిరుపతి రాజు, ఎస్ఐ నరేందర్ లు బందోబస్తు ఏర్పా టు చేశారు. ధారూరు స్టేషన్-దోర్నాల్ గ్రామాల మధ్య కాగ్నా (నది) పొంగి పోర్లడంతో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి.
ధ్వంసమైన రోడ్దు
బంట్వారం, ఆగస్టు 1 : సల్బత్తాపూర్ వద్ద రోడ్డు పూర్తిగా కొట్టుక పోగా మండల కేంద్రం నుంచి తాండూరు, వికారాబాద్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. నూరుమళ్లపూర్ వాగు పొంగి ప్రవహించడం వల్ల మండల కేంద్రం నుంచి వికారాబాద్ కు రాకపోకలు నిలిచి పోయాయి. స్థానిక ఎంపీడీవో బాలయ్య, ఏవో సంధ్య నూరుమళ్లపూర్ వద్ద వాగు పొంగి పొర్లడంతో అక్కడే నాలుగు గంటలు వేచి చూడాల్సి వచ్చింది.తొరుమామిడి-బంట్వారం మధ్యన బస్వపూర్ కాలనీ వద్ద నీటి ప్రవాహం ఎక్కువై రాకపోకలు స్తంభించాయి.
బెల్కటూర్‌లో కూలిన ఇల్లు
తాండూరు రూరల్, ఆగస్టు 1: వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. ఆదివారం రాత్రి కురి సిన వర్షానికి తాండూరు మండలం, బెల్కటూర్ గ్రామానికి చెందిన ఖైరత్అలీకి చెందిన ఇల్లు కూలింది. అయితే ఆ సమయంలో మరో గదిలో భార్యభర్తలతోపాటు పిల్లలు పడు కున్నారు. పక్కనే ఉన్న గది పై కప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో నిద్రలో ఉన్న వారు లేచి బయటికి పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
పెద్దేముల్, ఆగస్టు 1: మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో సోమవారం వర్షం దంచికొట్టింది. గాజీపూర్ వాగు సుమారు రెండు గంటల పాటు ప్రధాన రోడ్డుపై పొంగిపొర్లింది.దీంతో తాండూరు-సంగారెడ్డి ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది.
నవాబుపేట,జూలై1: మండల పరిధిలోని అత్తాపూర్, పూల్లపల్లి, అక్నాపూర్, పులి మామిడి, చించల్‌పేట గ్రామాల్లో కురిసిన వర్షానికి అత్తాపూర్ నుంచి పూలపల్లి గ్రామానికి వెళ్లే వాగుపై నుంచి వర్షపు నీరు పొంగిపోర్లి వాహనాదారులకు, పొలాలకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు కలిగాయి.
రంగారెడ్డి జిల్లాలో..
షాబాద్, ఆగస్టు 1: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో భారీ వర్షం కురిసింది. సోమవారం మధ్యా హ్నం సుమారు గంట పాటు కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపోర్లాయి. మండలంలోని కు మ్మరి గూడ గ్రామంలో వాగులు, చెక్ డ్యామ్‌లు ఉధృతంగా ప్రవ హిం చాయి. ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు వచ్చి చేరడంతో విద్యార్థులు, ఉపాధ్యా యులు కొంత ఇబ్బందులు పడ్డారు. సర్పంచ్ పొనమోని కేతన రమేశ్యా దవ్ పాఠశాల వద్దకు చేరు కుని వరద నీటిని తొలగింపజేశారు. కుమ్మరి గూడ వాగు ఉధృతంగా పారడంతో రాక పోక లు నిలిచి పోయా యి.
దర్గాలోకి వరద నీరు
నందిగామ,ఆగస్టు1: కొత్తూరు మం డలం సోమవారం మధ్యాహ్న భారీ వ ర్షం కురవ డంతో ఇన్ముల్‌నర్వ గ్రా మంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన జేపీ దర్గాలోకి వరద నీరు చేరింది. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులు, వ్యాపారస్తు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బంట్వారంలో అత్యధికంగా 53.9 మి.మీ వర్షపాతం
పరిగి, ఆగస్టు 1: జిల్లా పరిధిలోని పలుచోట్ల సోమవారం ఉదయం నుంచి వర్షం కురిసింది. జిల్లాలో ఒకటిరెండు చోట్ల భారీ వర్షం కురి సింది. తద్వారా ఆయా మండలాల్లోని వాగులు, వంకలు వరద నీటితో నిండుగా ప్రవహించాయి. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జిల్లాలో అత్యధికంగా బంట్వారంలో 53.9 మి.మీ., కోట్‌పల్లిలో 40.3 మి.మీ., మర్పల్లిలో 16.5 మి.మీ., పెద్దేముల్లో 10.8 మి.మీ., వికారాబాద్‌లో 8.3 మి.మీ., ధారూర్‌లో 5.8 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. తద్వారా సంబంధిత మం డలాల్లోని చెరువుల్లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. కొన్ని చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచి పోయాయి.