వికారాబాద్, జూలై 24: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని అర్చన చేయించారు. వికారాబాద్ పట్టణంలోని 32వ వార్డులో పోచమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు నవీన్‌కుమార్, అనంత్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ పట్టణంలో పారిశుధ్య కార్మికులతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల కేక్ కట్ చేశారు. ఆమె వెంట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, మాజీ జడ్పీటీసీ ముత్తహర్‌షరీఫ్ తదితరులు ఉన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో..
కొడంగల్/బొంరాస్‌పేట, జూలై 24: ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను కొడంగల్, బొంరాస్‌పేట, దుద్యాల మండలాల్లో టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకొన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎస్టీ గురుకుల పాఠశాలలో విద్యా ర్థుల మధ్య కేక్‌కట్ చేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్ మధు సూదన్యాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. బొంరాస్‌పేట పీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బొంరాస్ పేట, దుద్యాల మండలాల టీఆర్ ఎస్ అధ్యక్షులు కోట్ల యాదగిరి, చాంద్‌పాషా, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నారా యణరెడ్డి, టీఆర్ఎస్ తాలుకా అధికార ప్రతినిధి టీటీ రాములు నాయక్, మండల యూత్ అధ్యక్షుడు మహేందర్, ఎంపీటీసీ శ్రావణ్‌గౌడ్, పార్టీ నాయకులు రామకృష్ణా యాదవ్, సోంనాథ్, సలాం, శేఖర్‌గౌడ్ లచ్చప్ప తదితరులు పాల్గొన్నారు.
పరిగిలో రక్తదాన శిబిరం
పరిగి టౌన్, జూలై 24 : పరిగి పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిం చిన రక్తదాన శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రారంభించారు. రక్త దానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. మున్సిపల్ పరిధిలో నస్కల్ వెళ్లే దారిలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్‌కుమార్, జడ్పీ టీసీ హరిప్రియా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ కరణం అరవింద్‌రావు, మార్కెట్ కమి టీ చైర్మన్ అంతిగారి సురేందర్‌కుమార్, టీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనే యులు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, కులకచర్ల, పూడూరు ఎంపీపీలు సత్యహరి శ్చంద్ర, మల్లేశం, దోమ, కులకచర్ల జడ్పీటీసీలు నాగిరెడ్డి, రాందాస్‌నాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, కౌన్సిలర్లు నాగేశ్వర్, తాహెర్‌అలీ, వెంకటేశ్, నాయకులు రవి కుమార్, మహేందర్, రాఘవేందర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఎమ్మెల్యే కొప్పుల
దోమ, జూలై 24: దోమ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామ సమీపంలోని ఫారెస్టు భూమిలో 25 వేల మొక్కలను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, పార్టీ నాయ కులు కలిసి నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగిరెడ్డి, పరిగి మార్కెట్ కమిటి చైర్మన్ సురేందర్‌కుమార్, దోమ సర్పంచ్ రాజిరెడ్డి పాల్గొన్నారు.
మొక్కలు నాటిన నాయకులు
కులకచర్ల, జూలై 24 : టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు కులకచర్ల ఎంపీడీవో కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. చాపలగూడెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వ ర్యంలో నాయకులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్, టీఆర్ఎస్ పార్టీ కులకచర్ల, చౌడాపూర్ మండలాల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, సత్తినేని సుధాకర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్య క్షుడు రాజు, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, వైస్ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్, లక్ష్మయ్య, మొగులయ్య, మఠం రాజశేఖర్, గుండుమల్ల నర్సిం హులు, టీఆర్ఎస్ పార్టీ చౌడాపూర్, కులకచర్ల మండలాల నాయకులు పాల్గొన్నారు.
రోగులకు పండ్లు పంపిణీ
కోట్‌పల్లి, జూలై 24: కోట్‌పల్లి మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేక్‌కట్ చేసి, స్వీట్లు పంచుకుని వేడు కలను నిర్వహించారు. దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు కార్యక్ర మంలో స్థానిక సర్పంచ్ నక్కల విజయలక్ష్మి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్, మత్స్యశాఖ మండల అధ్యక్షుడు అనంద్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్మికులకు దుస్తులు పంపిణీ
మర్పల్లి ,జూలై 24: మార్కెట్ కార్యాలయం ఆవరణలో పార్టీ మండల యూత్ అధ్య క్షుడు మధుకర్ ఆధ్వర్యంలో కేక్ కట్‌చేశారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు పం డ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యు డు సోహెల్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లేశం, టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అశోక్, టీఆర్ఎస్ నాయకులు రామేశ్వర్, సురేశ్, వసంత్‌కుమార్, బట్టు రమేశ్, సంతోశ్, పీర్యానాయక్, టీఆర్ఎస్ పార్టీ మర్పల్లి గ్రామాధ్యక్షుడు గఫార్, ఖాజా, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మర్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామేశ్వర్ పం చాయతీ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఫసియుద్దీన్, ఉప సర్పంచ్ రాజు, కో ఆప్షన్ సభ్యుడు సోహెల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవి, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు సురేశ్ కుమార్, నాయకులు ఎం.సురేశ్, రవీందర్‌రెడ్డి, శ్రీకాంత్, వినోద్ స్వామి, పాండు రంగారెడ్డి, జాఫర్, రతన్, రాచన్న పాల్గొన్నారు.
ఆలయాలకు విరాళాలు..
ధారూరు/బంట్వారం జూలై 24: ధారూరు మండలంలోని నాగసముందర్ గ్రామంలో వడ్ల నందు ఆధ్వర్యంలో వేడుకలను జరుపుకొన్నారు. గ్రామంలో నిర్మించబోతున్న హనుమాన్ మందిర నిర్మాణానికి వడ్ల నందు రూ. లక్ష విరాళం అందించారు. బం ట్వారం మండలంలోని సల్బత్తాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయ నిర్మాణానికి రూ. 11వేలు విరాళంగా అందించారు.
నవాబుపేట మండల కేంద్రంలో..
నవాబుపేట, జూలై24: మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సం బురాలు జరిగాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ భవాని, జడ్పీటీసీ జయమ్మ, ఎంపీ టీసీ కందాడ పద్మ, నవాబుపేట సర్పంచ్ న్యాలం విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి పాల్గొన్నారు.