ఇబ్రహీంపట్నం, జూలై 22 : పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉమార్ఖాన్గూడకు చెందిన బండారి ఐలమ్మ అనారోగ్యంతో బాధపడుతూ..నగరంలోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఆమె వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.1.50లక్షల ఎల్వోసీని శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన అందజేశారు. వారి వెంట టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు విజయ్‌బాబు, ప్రవీణ్‌కుమార్, శేఖర్, పరమేశ్ ఉన్నారు.