మంచాల, జూలై 20 : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ 23న మంచాల మండలం జాపాల-కాగజ్‌ఘట్ అడవి ప్రాంతంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరవుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రశాంత్ కుమార్‌రెడ్డి అన్నారు. మొక్కలు నాటే ప్రాంతాన్ని బుధవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24న కేటీఆర్ జన్మదినం సందర్భంగా 23న మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవం తం చేసేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అదేవిధంగా జిల్లా పరిషత్ సీఈవో దిలీప్‌కుమార్, ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ నిత్య మొక్కలు నాటే ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, అటవీశాఖ అధికారి లక్ష్మి, విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ్ట జగదీశ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు బద్రినాథ్గుప్తా, నాయకులు మల్లప్ప, చంద్రకాంత్, ప్రవీణ్ పాల్గొన్నారు.
పర్యటనను విజయవంతం చేయండి
యాచారం : ఇబ్రహీంపట్నంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయిశరణం ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ప్రతి గ్రామం నుంచి 25 వరకు బైకులు ర్యాలీగా వెళ్లాలన్నారు. శేరిగూడ వద్ద మంత్రికి ఘన స్వాగతం పలకాలన్నారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గురునానక్ కళాశాలల నిర్వహించే రక్తదాన శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ జంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, సర్పంచ్‌లు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద ఎత్తున పాల్గొనాలి
మంచాల : మంత్రి కేటీఆర్ పర్యటనలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి మొక్కలు నాటిన అనంతరం నిర్వహించే సభను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ పుల్లారెడ్డి, యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు జంబుల కిషన్‌రెడ్డి, చిందం రఘుపతి, చంద్రయ్య, పున్నం రాము, మహేందర్, చంద్రకాంత్, ప్రవీణ్, మల్లప్ప, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ కదలాలి
తుర్కయాంజాల్, జూలై 20 : నియోజకవర్గంలో 23న జరిగే మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధి టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు అమరేందర్ అధ్యక్షతన మన్నెగూడలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 29 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే విధంగా లక్ష మొక్కలను నాటనున్నారని అన్నారు. సమావేశంలో కౌన్సిలర్ కల్యాణ్ నాయక్, సహకార సంఘం బ్యాంక్ డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ కందాడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలు భారీగా తరలిరావాలి
ఇబ్రహీంపట్నం రూరల్ : మంత్రి కేటీఆర్ పర్యటన దృష్ట్యా మండలంలోని అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలను భారీగా తరలించేందుకు టీఆర్ఎస్ పార్టీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు అన్నారు. మండలస్థాయి కార్యకర్తల సమావేశం వినోద కన్వెన్షన్హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, సహకార సంఘం చైర్మన్లు బిట్ల వెంకట్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.