ఇబ్రహీంపట్నం, జూలై 20 : ఈ నెల 23న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటన సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంత్రి పర్యటన దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, నాలుగు మున్సిపాలిటీల నుంచి భారీగా జన మీసకరణ చేసేందుకు కార్యకర్తలు, నాయకులతో ముమ్మరంగా సమావేశాలు కొనసాగుతున్నాయి.
కేటీఆర్ జన్మదినం ముందు రోజునే ఇబ్రహీంపట్నం విచ్చేస్తున్న సందర్భంగా నియోజకవర్గంలోని జాపాల అటవీ ప్రాంతంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్న నేపథ్యంలో పెద్దఎత్తున ఉపాధి కూలీలతో అన్ని శాఖల అధికారులు గోతులు తీయించే కార్యక్రమం చేపడుతున్నారు. ఆయా మండల, మున్సిపల్ అధ్యక్ష, కార్యదర్శులు భారీ జనమీకరణ కోసం ప్రత్యేకంగా కృషిచేస్తున్నారు.
జాపాల సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమంతోపాటు బీడీఎల్ ప్రధాన రహదారి, మార్కెట్ యార్డు నూతన రోడ్డు, మడిగెల నిర్మాణం, గిరిజన కళాశాల నూతన భవన ప్రారంభోత్సవం, ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న రక్తదాన శిబిరానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రశాంత్కుమార్రెడ్డి స్వయంగా పరిశీలించి, ఇంకా పకడ్బందీ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు.
మంత్రి పర్యటన వివరాలు..