సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ) : కరోనా వేళ వరుసగా కురుస్తున్న వానలతో సీజనల్ ముప్పు పొంచి ఉన్నట్లు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒమిక్రాన్ సబ్వేరియైంట్లెన బీఏ-4, బీఏ-5 వేరియంట్లతో కేసులు పెరుగుతుండడం, ఇదే సమయంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో ఏది సీజనలో, ఏది కరోనానో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
అయితే కొన్ని లక్షణాల ఆధారంగా సీజనల్ వ్యాధులు, కరోనా వైరస్ను గుర్తించ వచ్చంటున్నారు స్టార్ హాస్పిటల్ వైద్యనిపుణులు డాక్టర్ రాజేశ్. ఇప్పుడు కూడా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం సీజనల్లో డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు కొంత ఆందోళన కలిగిస్తున్నందున వాటిపై ప్రజలు అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. కలుషిత ఆహారం, కలుషిత నీరు తాగడం వల్ల టైఫాయిడ్ వస్తుందని, ముఖ్యంగా సాల్మనెల్లాటైఫి అనే బ్యాక్టీరియా టైఫాయిడ్ జ్వరం రావడానికి దోహదపడుతుందని చెప్పారు.
వ్యాధి లక్షణాలు
వ్యాధి నిర్ధారణ పరీక్షలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తినాలి. ఆహారపదార్థాలపై ఎప్పుడూ మూతలు ఉంచాలి.
ప్రతిఒక్కరూ భోజనం ముందు శుభ్రతను పాటించాలి. కలుషిత నీరు తాగరాదు. కుళ్లిన, పాచిపోయిన ఆహారం, పండ్లను తీసుకోవద్దు.
బహిరంగ ప్రదేశాల్లో దుమ్ము, ధూళి సోకిన పదార్థాలను తీసుకోవద్దు.
కొవిడ్, డెంగీ జ్వరాల లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల జబ్బును గుర్తించడంలో పొరబడే, జాప్యం జరిగే అవకాశాలూ ఎక్కువ రెండింటిలోనూ సుమారు 80 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు.
సమస్య తీవ్రమైతే ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించాల్సి ఉంటుంది.
త్వరితగతిన గుర్తించి, వేగంగా చికిత్స అందించడమే ముఖ్యం.