యాచారం, జూలై 20 : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను నందనవనంగా మార్చారు పోలీసు సిబ్బంది. సీఐ లింగయ్య ఆధ్వర్యంలో మొక్కలను సంరక్షిస్తుండడంతో ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. స్టేషన్ ఆవరణలో ఎటూ చూసినా పచ్చని మొక్కలే దర్శనమిస్తాయి. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు చెట్ల కింద సేదతీరుతున్నారు. ఠాణాలో నీడనిచ్చే చెట్లతో పాటు డిజైన్, తీగజాతి, పూలు, పండ్ల మొక్కలు చూపరులను కనువిందు చేస్తున్నాయి.
ఇప్పటికే జరిగిన హరితహారం కార్యక్రమాల్లో అప్పటి సీపీ, డీసీపీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీపీ, జడ్పీటీసీ, తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్ఐ, పోలీసు సిబ్బంది తదితరులు వేప, జామ, ఉసిరి, టేకు, అల్లనేరేడు, మామిడి వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలను నాటారు. వాటికి పోలీసు సిబ్బంది పాదులు చేసి, నీరు పోస్తుండడంతో నేడు ఏపుగా పెరిగాయి. కొన్ని పండ్ల మొక్కలు ఫలాలను ఇస్తుండడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు పోలీస్‌స్టేషన్ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నది.
మొక్కలను
పోలీస్‌స్టేషన్‌లో నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తున్నాం. నిత్యం నీళ్లు పోయడంతో పాటు ట్రీగార్డులను ఏర్పాటు చేశాం. అప్పుడప్పుడు మరిన్ని మొక్కలను తీసుకొచ్చి నాటుతున్నాం. స్టేషన్‌కు వచ్చే ప్రజలకు పచ్చని చెట్లు ఎంతో ప్రశాంతతనిస్తున్నాయి.
– లింగయ్య, సీఐ యాచారం