ఇప్పటికే పలుమార్లు చమురు, వంటగ్యాస్ ధరలు పెంచి పేదోడి నడ్డి విరిచిన కేంద్ర సర్కార్ జీఎస్టీ పెంపుతో మరోసారి ఎనలేని భారం మోపుతున్నది. నిత్యావసరాలైన పాలు, పన్నీరు, బెల్లం, బియ్యం పిండి.. ఇలా దేన్నీ వదలకుండా ఇష్టమొచ్చినట్లు జీఎస్టీని విధిస్తున్నది. దీనిపై ఉమ్మడి జిల్లా ప్రజలు భగ్గుమన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీలు, రోడ్ల దిగ్బంధం, ధర్నాలు, కేంద్ర పభుత్వం దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. నిరసనలతో ఉమ్మడి జిల్లా మొత్తం దద్దరిల్లింది. ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికే నిత్యవసరాల ధరలు ఆకాశన్నంటడంతో నిరుపేదలు పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీస్తున్నారని, ప్రస్తుతం కేంద్రం నిర్ణయంతో పస్తులుండే దుస్థితి ఏర్పడే ప్రమాదముందన్నారు. చిన్నపిల్లలు తాగే పాలపై కూడా పన్ను విధించడం కేంద్రానికి సిగ్గుచేటన్నారు. వెంటనే జీఎస్టీ విధింపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
ఇబ్రహీంపట్నం, జూలై 20 : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో సామాన్యులను దగా చేస్తున్నకొల్లగొడుతుండడంతో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సాగర్హ్రదారిపై రాస్తారోకో వాహనాలు భారీగా నిలిచాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాతూ నిత్యావసర సరుకులపై కేంద్ర సర్కార్ జీఎస్టీ విధిస్తుందన్నారు. దవాఖానల్లో అసువులు బాసినా జీఎస్టీ వసూలు చేస్తుందన్నారు. రాష్ట్రం నుంచి ఏటా కోట్ల రూపాయలను పన్నుల రూపంలో కొల్లగొడుతున్నదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు ఇబ్బందులు పడుతుంటే బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకోడవం ఏమిటని ప్రశ్నించారు.
అన్ని రాష్ర్టాల ఆమోదంతోనే జీఎస్టీ పెంచామని, కేంద్ర మంత్రి నిర్మల సీతారామ్ చెప్పడం సిగ్గుచేటన్నారు. జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, లేదంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు బి.రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం వైస్‌చైర్మన్ ఆకుల యాదగిరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గ రాములు, రైతుబంధు సమితి అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు అల్వాల వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రావు, భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్లు జగన్, బాలరాజు, టీఆర్ఎస్ నాయకులు జెర్కోని రాజు, మైలారం విజయ్‌కుమార్, సహకార సంఘం చైర్మన్ వెంకట్‌రెడ్డి, నాయకులు నర్సింహ, గణేశ్, రమేశ్, ఎల్లేశ్, బాలుగౌడ్, శ్రీనివాస్, ఆంజనేయులు, యాదగిరి, జలంరద్, నర్సింహ, సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మన్నెగూడ చౌరస్తాలో..
తుర్కయాంజాల్, జూలై 20 : సగటు మనిషి నిత్యం ఉపయోగించే నిత్యావసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం దుర్మార్గపు చర్య అని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాల్లో ముఖ్యమైన పాలపై జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రదాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలు కొవిడ్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ప్రజలను పీడిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కల్యాణ్ నాయక్, తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ సంజీవరెడ్డి, రాగన్నగూడ మాజీ సర్పంచ్ కందాడ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు అశ్విని, నాయకులు కృష్ణ, సుదర్శన్‌రెడ్డి, బిందు రంగారెడ్డి, మర్రి సంపతీశ్వర్రెడ్డి, చెవుల దశరథ, నిరంజన్‌రెడ్డి, విజయానంద్‌రెడ్డి, బాబు, మోహన్‌గుప్తా, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పాలు, పెరుగుపై జీఎస్టీ విధించడం సరికాదు
– పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
దోమ, జూలై 20 : పాలు, పెరుగు క్రయ విక్రయాలపై జీఎస్టీ విధించడం పేదల నడ్డివిరచడమేనని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం దోమ మండల కేంద్రంలోని హనుమాన్ చౌరస్తాలోని ప్రధాన కూడలీలో పాలు, పెరుగు క్రయ విక్రయాలపై కేంద్రం జీఎస్టీ విధించిన సందర్భంగా శ్రేణులతో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలు, పెరుగు క్రయ విక్రయాలపై జీఎస్టీ విధించడం పేదల నడ్డివిరిచడమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి, చిరు ఉద్యోగులు పాలపై జీఎస్టీ విధించడం వల్ల ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న విధంగానే పాలపై విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగిరెడ్డి, ఎంపీపీ అనుసూయ, వైస్ ఎంపీపీ మల్లేశం, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, కో ఆప్షన్ ఖాజాపాషా, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.