పెద్దేముల్, జూలై 19: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ అనురాధ, జడ్పీటీసీ ధారాసింగ్ అన్నారు. మంగళ వారం మండల పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జి ఎంఈవో వెంకటయ్య ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసి, పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను, వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఘ నంగా సన్మానించారు. జడ్పీటీసీ ధారాసింగ్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2 వేల నగదును అందించి ప్రోత్సహించారు. ఈ సంద ర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ బోధన అందుతుం దన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ద్యావరి విజయమ్మ, వైస్ ఎంపీపీ మధులత, ఇన్చార్జి ఎంఈవో వెంకటయ్య, ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
కులకచర్ల, జూలై 19: విద్యార్థులు ప్రభుత్వం కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ అన్నా రు. మంగళవారం చౌడాపూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్‌లు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ
దోమ, జూలై19: మండల పరిధిలోని శివారెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సర్పంచ్ నరేందర్‌రెడ్డి అధ్యక్షతన నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రెటరీ ఎం కృష్ణయ్య, హెచ్ఎం నర్సిం హులు, చైర్మన్ సత్యనారాయణ, శ్రీకాంత్‌రెడ్డి, గౌస్‌ఖాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
వాసవీ జ్యుయలర్స్ ఆధ్వరంలో..
కోట్‌పల్లి, జూలై 19: వికారాబాద్ పట్టణానికి చెందిన వాసవీ జ్యుయలర్స్ వారు విద్యార్థు లకు పది సంవత్సరాలుగా ఉచితంగా నోట్ పుస్తకాలను అందించేందుకు ముందుకు రావడం చాలా సంతోషకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వంపంతులు అన్నా రు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి నోట్‌పుస్తకాలను విద్యార్థులకు పం పిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నక్కల విజయలక్ష్మీ, ఎంపీటీసీ మహేశ్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్, విద్యాకమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.