మర్పల్లి, జూలై 19: వర్షాకాలం సందర్భంగా గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుడుగుంట, గుర్రంగట్టు తండాల్లో ‘మీతో-నేను’ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులు దరఖాస్తూ చేసుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశిం చారు.
కుడుగుంటకు రూ.ఐదు లక్షలు, గుర్రంగట్టు తండాకు రూ.ఐదు లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండల నాయకుల సమక్షంలో మర్పల్లి యూత్ అధ్య క్షుడిగా బూచన్‌పల్లి మధుకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుని సన్మానించారు. అంతకు ముందు పశువైద్యాధికారులతో కలిసి కుడుగుంటలో గొర్రెలకు బ్లూ టంగ్ వ్యాక్సినేషన్‌ను ప్రారం భించారు. కాగా మండల కేంద్రంలో మహమ్మద్ హఫీజ్, పట్లూర్‌లో బోయిని లాలు, ఉపాధ్యాయుడు ఒగ్గు మల్లయ్య ఇటీవల మృతి చెందారు. ఎమ్మెల్యే ఆనంద్ వారి ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళు లర్పించారు.
కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఉమారాణి గోపాల్‌రెడ్డి, సోనీ బాయి, ఎంపీటీసీ రవిందర్, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ యాదయ్య, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు నాయబ్‌గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ఉపా ధ్యక్షుడు అశోక్, మండల ప్రధానకార్యదర్శి రాచన్న, యూత్ అధ్యక్షుడు మధుకర్, గోపాల్ రెడ్డి, సంతోష్‌కుమార్, ఎంపీడీవో జగన్నాథ్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీధర్, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.