కొడంగల్, జులై 18: సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ప్రధానోపా ధ్యాయులు క్రాంతికుమార్ తెలిపారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని పాతకొడంగల్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థు లకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న పాఠ్యపుస్త కాలను ఉపాధ్యాయులు అందించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువుల్లో రాణించాలన్నారు. కార్యక్ర మంలో ఉపాధ్యాయురాలు సంధ్య విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలి
బొంరాస్పేట, జూలై 18 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు హెచ్ఎం పాపిరెడ్డి సోమవారం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన అమలు చేస్తున్నా రని, దానికి అనుగుణంగా ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను విద్యా ర్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నదన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని చదువుల్లో రాణించాలని కోరారు. కార్య క్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఎంఆర్ సీకి చేరిన పాఠ్య పుస్తకాలను సోమవారం ఎంఆర్సీ సిబ్బంది మహ్మద్ గౌస్, సీఆర్పీలు నర్సింహులు, సోమ్లానా యక్ ఆయా పాఠశాలల హెచ్ఎంలకు పంపిణీ చేశారు.
ప్రతి విద్యార్థికి ఉచిత పాఠ్యపుస్తకాలు
బంట్వారం, జులై 18 : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం అందిస్తున్నదని సర్పంచ్ లావణ్యశ్రీనివాస్ పేర్కొన్నారు. సోమ వారం మండల కేంద్రంలోని ప్రాథమిక, ప్రాథమి కోన్నత పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచి అర్హత గల ఉపా ధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉంటారన్నారని, వీరు అంకిత భావంతో పని చేస్తారన్నారు. కార్యక్రమంలో ప్రాధానో పాధ్యాయుడు బందయ్య, ఉపాద్యాయులు సుదర్శన్, రాం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
వారం తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం
పెద్దేముల్, జూలై 18: వర్షాల కారణంగా మండల కేంద్రం తోపాటు ఆయా గ్రా మాల్లోని పాఠశాలలు సెలవులు ముగిసిన తరువాత సోమవారం నుంచి పున:ప్రారంభం అయ్యాయి. మండలానికి మొత్తం 23,966 పాఠ్య పుస్తకాలు అందాయి.