షాబాద్, జూలై 18: రాష్ట్రంలోని దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలో కొమరబండ గ్రామానికి చెందిన యాదమ్మకు దళితబంధు పథకం కింద మంజూరైన ట్రాక్టర్‌ను జడ్పీటీసీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 ఏండ్ల కాలంలో ఏ ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు అమలు చేయని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దళితబంధు పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.10లక్షలతో వాహనాలు అందించడం గొప్ప పరిణామమన్నారు.
ప్రభుత్వ సహకారంతో అత్యధికంగా నిధులు తీసుకువచ్చి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పాలనలో గ్రామాల రూపు రేఖలు మారుతున్నాయని వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాజేందర్‌గౌడ్, గ్రామ సర్పంచ్ ఏశాల చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రాందేవ్యాదవ్, మంగళి సత్యం, రాంచందర్, నర్సింహులు, గోపాల్, జంగయ్య, రాజు తదితరులున్నారు.