షాద్నగర్టౌన్, జూలై 18: ప్రజా ఆరోగ్యానికి సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీ నెహ్రూనగర్కాలనీ చెందిన వరుణ్తేజకు రూ. 55 వేలు, నాగరాజుకు రూ. 60 వేలు, కసాబ్వాడకు చెందిన అనూషకు రూ. 14 వేల సీఎం సహాయనిధి చెక్కులను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పేద ప్రజల అభ్యన్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ప్రజా ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిష్టయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్ సర్వర్పాషా పాల్గొన్నారు.
టీఆర్ఎస్ నాయకుడి మృతికి ఎమ్మెల్యే సంతాపం
కేశంపేట : కేశంపేట మండలం నిర్దవెళ్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు బురాన్ఖాన్ మృతి బాధాకరమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బురాన్ఖాన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు నిర్దవెళ్లికి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, నాయకులు వెంకటయ్య, కృష్ణయ్య, మల్లయ్య, యాదయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు